Shambhala: ఆది.. శంబాల ట్రైల‌ర్ అదిరింది! గ‌ట్టిగానే ఫ్లాన్ చేశారుగా

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:00 PM

ఆది సాయి కుమార్ హీరోగా తెర‌కెక్కిన శంబాల మూవీ ట్రైల‌ర్‌ను ఆదివారం నాని రిలీజ్ చేశారు.

Shambhala

ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar), అర్చ‌న అయ్య‌ర్ (Archana Iyer), స్వాసిక (Swasika) లీడ్ రోల్స్‌లో తెర‌కెక్కిన చిత్రం శంబాల (Shambhala ). ఏ (యాడ్ ఇన్పినిటం) ఫేం యుగంధ‌ర్ ముని (Ugandhar Muni) ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంచుశాడు. ఈ సినిమా డిసెంబ‌ర్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈనేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాట‌లు, గ్లింప్స్ , టీజ‌ర్ అన్ని సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి.

అయితే సినిమాకు మ‌రో మూడు రోజుల స‌బ‌యంమే ఉండ‌గా తాజాగా.. ఆదివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను నాచుర‌ల్ స్టార్ నాని (Nani) చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం నాని మాట్లాడుతూ.. ‘‘శంబాల’ ట్రైలర్‌ని ఇప్పుడే చూశాను. అద్భుతంగా ఉంది. ఇలాంటి జానర్ చిత్రాల్నే ఆడియెన్స్ ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాల్ని కరెక్ట్‌గా చేస్తే.. టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా సెట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుందో ఇది వరకే చూశాం. ఈ ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే ఇంగ్లీష్ సాంగ్ కూడా అదిరిపోయింది. ఆ పాట చాలా స్టైలీష్‌గా ఉంది. ఆది నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. మంచి నటుడు, మంచి డ్యాన్సర్. మంచి నటుడికి మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘శంబాల’తో ఆదికి మంచి విజయం దక్కాలి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి. ‘శంబాల’ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఈ ట్రైల‌ర్‌ను చూస్తే మేక‌ర్స్ ముందు నుంచి చెబుతూ వ‌స్తున్న‌ట్టుగానే ఔట్ అండ్ మిస్టిక్ హ‌ర్ర‌ర్ థ్రిల‌ర్‌తో స‌మ్‌ధ‌ఙంగ్ ఏదో ఉంది అని అనిపించేలానే థ్రిల్ చేసేలా ఉంది. ఆకాశం నుంచి ఉల్క ప‌డ‌డం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపీఠాల్ని తీసుకు రావడం, ఊర్లో వింత వింత ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం, ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డం మ‌ధ్య‌లో ఈ మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం స‌డ‌న్‌గా హ‌ర్రర్ షాట్ల‌తో ట్రైల‌ర్ బాగా క‌ట్ చేశారు. ఈ సారి ఆదికి హిట్ గ్యారంటీగా ప‌డుతుంద‌నేలా ప్రామిసింగ్‌గా ఉంది.

Updated Date - Dec 21 , 2025 | 01:00 PM