Poraga Poraga: పోర‌గా పోర‌గా.. పోరి జోలికిబోకురా! నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్.. రోహిత్‌ ప్రైవేట్ సాంగ్

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:27 PM

ప్రేమిస్తున్నా.. ప్రేమిస్తున్నా అనే బేబీ సినిమాలో పాడిన గీతంతో జాతీయ అవార్డు ద‌క్కించుకున్న గాయ‌కుడు రోహిత్ అంతా తానే చేసిన ఓప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేశాడు.

ప్రేమిస్తున్నా.. ప్రేమిస్తున్నా (Premisthunna Song) అనే బేబీ (Baby) సినిమాలో పాడిన గీతంతో జాతీయ అవార్డు (National Award Winner) ద‌క్కించుకున్న గాయ‌కుడు రోహిత్ ( P V N S Rohit) తెలుగు వారి పేరును జాతీయ స్థాయిలో ఇనుమ‌డింప జేశాడు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రైవేట్ సాంగ్ నెట్టింట తెగ రచ్చ చేస్తోంది. త‌నలోని సృజ‌నాత్మ‌క‌త మొత్తాన్ని వెలికితీస్తూ ఆయ‌నే స్వ‌యంగా లిరిసిస్ట్ అవ‌తారం ఎత్తడ‌మే గాక స్వ‌యంగా సంగీతం అందించి, ద‌ర్శ‌క‌త్వం చేసిన పాట పోర‌గ పోర‌గా (Poraga Poraga) యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

పూర్తిగా తెలంగాణ మాండ‌లికంలోని తెలుగు ప‌దాల‌ను ఉప‌యోగించి ముఖ్యంగా హైద‌రాబాదీ యాష‌, భాష‌ను క‌ళ్ల‌కు క‌డుతూ ఈ పాట‌ను రూపొందించ‌డం విశేషం. పోర‌గా పోర‌గా పూరుగా పుట్టావురా.. పోరి జోలికిబోకురా అంటూ సాగిన ఈ పాట ఆద్యంత అల‌రించేలా, వినే వారికి ఇట్టే క‌నెక్ట్ అయ్యేలా ఉంది.

అమ్మాయిలా జోలికి పోవ‌ద్దు.. పోతే నీ బ‌తుకు బ‌స్టాండ్ అవుతుందిరా అంటూ నేటి యూత్ ప‌రిస్థితి గురించి వారికే చెబుతూ హిత‌బోధ చేస్తూ అబ్బాయిల మెంట‌లాటీని అద్దం ప‌ట్టేలా ఈ పాట సాగ‌డం విశేషం. పాట కొన్నాళ్లు యూత్‌లో వైర‌ల్ అవ‌డం గ్యారంటీలా ఉంది. మీరూ ఇప్పుడే మీ చెవులారా వినండి మ‌రి. సంగీతం, సాహిత్యం అంతా బావున్నాయి. మ‌ధ్య మ‌ధ్య‌లో గు.. గు... అంటూ వ‌చ్చే సౌండ్ చివ‌ర్లో వ‌చ్చే మ‌రో సౌండ్‌ కాస్త డ‌బుల్ మీనింగ్ అనిపించేలా ఉండ‌డం విడ్డూరం.

Updated Date - Dec 21 , 2025 | 01:35 PM