Nari Nari Naduma Murari Teaser: రాజాలా పెంచారా.. ఇలా రోజా ముందు కూర్చుంటావనుకోలేదు

ABN , Publish Date - Dec 22 , 2025 | 06:45 PM

హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో శర్వానంద్ (Sharwanand) ఒకడు. చాలా గట్టిగా విజయం కోసం పోరాడుతున్నాడు. అందులో భాగంగానే సామజవరగమనా సినిమాతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజును నమ్ముకున్నాడు.

Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari Teaser: హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో శర్వానంద్ (Sharwanand) ఒకడు. చాలా గట్టిగా విజయం కోసం పోరాడుతున్నాడు. అందులో భాగంగానే సామజవరగమనా సినిమాతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజును నమ్ముకున్నాడు. ఆయన దర్శకత్వంలో శర్వా నటిస్తున్న చిత్రం నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari ). ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వా సరసన సంయుక్త మీనన్ (Samyukta Menon), సాక్షి వైద్య (Sakshi Vaidhya) నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

సామజవరగమనా లాంటి కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకులను మెప్పించిన రామ్.. ఈసారి కూడా అదే కామెడీతో వస్తున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. పెళ్లి కూతురుని తీసుకురావడానికి వెళ్తున్నాను.. అంటూ శర్వా, సత్య ఆటోలో వెళ్తున్నప్పుడు మాట్లాడే సీన్ తో టీజర్ మొదలయ్యింది. శర్వా.. ఆఫీస్ లో తనతో పనిచేసే సాక్షితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చూస్తారు. ఆ సమయంలోనే అదే ఆఫీస్ కి శర్వా ఎక్స్ లవర్ అయిన సంయుక్త ఎంట్రీ ఇస్తుంది. తనను తప్ప ఇంకొకరిని ప్రేమించను అని చెప్పిన శర్వా.. మరొకరిని ప్రేమిస్తున్నాడు అని తెలిసి మండిపడుతుంది. అలా ఒకే ఆఫీస్ లో ఇద్దరు ప్రియురాళ్ల మధ్య నలిగిపోయే ప్రేమికుడు.. చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

శర్వా మాత్రం సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. కామెడీతో సినిమాను నింపేశాడు డైరెక్టర్. ఇక సత్య, వెన్నెల కిషోర్, నరేష్ కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ సినిమా జనవరి 14 సాయంత్రం నుంచి రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో శర్వా విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Updated Date - Dec 22 , 2025 | 06:46 PM