Prabhutva Sarayi Dukaan: మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:52 AM

నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. విక్రమ్‌, అదితి జంటగా నటించారు. దైవ నరేశ్‌ గౌడ్‌, పరిగి స్రవంతి మల్లిక్‌ నిర్మించారు. ఇటీవలె నిర్వహించిన...

నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. విక్రమ్‌, అదితి జంటగా నటించారు. దైవ నరేశ్‌ గౌడ్‌, పరిగి స్రవంతి మల్లిక్‌ నిర్మించారు. ఇటీవలె నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ ‘1980ల నాటి ఓ తెలంగాణ గ్రామంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మనసుకు హత్తుకునే భావోద్వేగాలున్న కథ ఇది’ అని అన్నారు. ‘పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. వాణిజ్య, సామాజిక అంశాలను కలిపి నరసింహ నంది మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు’ అని నిర్మాతలు తెలిపారు.

Updated Date - Jul 17 , 2025 | 05:52 AM