Nara Rohith: వినాయక చవితికి కుటుంబం మొత్తం చూసేయండి 

ABN , Publish Date - Aug 16 , 2025 | 07:41 PM

నారా రోహిత్  హీరోగా నటిస్తున్న  20వ సినిమా 'సుందరకాండ'.  వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

నారా రోహిత్  (Nara Rohith( హీరోగా నటిస్తున్న  20వ సినిమా  'సుందరకాండ' (Sundarakanda).  వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.  ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో 

నారా రోహిత్ మాట్లాడుతూ 'సుందరకాండ ట్రైలర్, సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాను చూడొచ్చు. సినిమా మొదలైనప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఇప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాం. వినాయక చవితికి ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా టెక్నీషియన్స్ కోస్టార్స్ అందరికీ ఈ సినిమా చాలా మంచి జ్ఞాపకంగా ఉంటుంది. చాలా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ ని లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్యూ.  వినాయక చవితి రోజు ఫ్యామిలీ అంతా కలసి థియేటర్స్ లో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

శ్రీ దేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ  ' ఈ సినిమా విడుదల కోసం మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాం.చాలా కాలం తర్వాత ఈ సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసిన ప్రభాస్ గారికి థాంక్యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఎంటర్టైనర్ ఇది. థియేటర్ కి వచ్చి అందరూ హ్యాపీగా చూడొచ్చు' అన్నారు.  
 

డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ  'రాప్ ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  ఆగస్టు 27న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ సినిమా పండగ రోజు రిలీజ్ అవ్వడం ఒక డ్రీమ్ మూమెంట్. సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను' అన్నారు.  


నిర్మాత  సంతోష్ మాట్లాడుతూ 'వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న సుందరకాండ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన రాప్  ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఆడియన్స్,  ఇండస్ట్రీ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది' అన్నారు 

Updated Date - Aug 16 , 2025 | 07:49 PM