Napoleon Returns: తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారితే.. ఈ తరహా సినిమా ఇప్పటిదాకా రాలేదు...
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:09 PM
ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం లాంఛ్ చేశారు.
ఆనంద్ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం లాంఛ్ చేశారు. ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్ రవి రూపొందించిన నెపోలియన్, ప్రతినిధి, కొరమీను చిత్రాలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ యాక్టర్- డైరెక్టర్ ఆనంద్ రవి మరోసారి యూనిక్, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో నెపోలియన్ రిటర్న్స్‌గా మన ముందుకు రాబోతున్నారు. ఆనంద్ రవి తనదైన స్టైల్లో ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. దీంతో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
వశిష్ట మాట్లాడుతూ 'నీడ పోయిందని ‘నెపోలియన్’ తీశాడు. జంతువుల ఆత్మతోనూ కథను రాసుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ మూవీ కథ నాకు తెలుసు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ‘నెపోలియన్ రిటర్న్స్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సాయి రాజేష్ మాట్లాడుతూ 'నేను ఇక్కడకు ఆనంద్ రవి కోసం వచ్చాను. నేను, వశిష్ట, ఆనంద్ రవి మంచి స్నేహితులం. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ చాలా బాగుంది. ఈ మూవీతో ఆనంద్ రవికి పెద్ద విజయం దక్కాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడుతూ 'ఈ సినిమా ప్రయాణంలో నాకు గుప్తా గారెంతో సహకరించారు. ‘పేరెంట్స్’, ‘ప్రతినిధి’, ‘నెపోలియన్’, ‘కొరమీను’ చిత్రాలు తీశాను. నేను అందరికీ తెలుసు. కానీ సరైన సక్సెస్, గుర్తింపు రాలేదు. కానీ ‘నెపోలియన్ రిటర్న్స్’తో నాకు సక్సెస్, మంచి గుర్తింపు వస్తుంది. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్‌గానే ఉంటుంది. తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకు ఎక్కడా సినిమా రాలేదు. మున్ముందు ఈ మూవీ గురించి మరింతగా తెలియజేస్తాను’ అని అన్నారు.
దివి మాట్లాడుతూ 'నెపోలియన్’ తరువాత ఆనంద్ రవి గారిని కలిశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఆనంద్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ మూవీ గురించి మున్ముందు అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.