kandula Durgesh: నంది అవార్డులపై ప్రకటన.. మొత్తం మారిపోతుంది

ABN, Publish Date - May 19 , 2025 | 11:17 AM

ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ (Kandula Durgesh) సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడారు. భైౖరవం’ ట్రెలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ (Cinema industry) కోసం అవసరమైన ప్రణాళికలు సీఎం చంద్రబాబు నాయుడు(Nara Chandrababu naidu), ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pavan Kalyan)నేతృత్వంలో రచిస్తున్నామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ (Kandula Durgesh) అన్నారు. భైౖరవం’ ట్రెలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దుర్గేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఏపీలో అద్భుతమైన అందాలున్నాయి. ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇంకా మౌలిక సదుపాయా?ని అభివృద్థి చెందాల్సి ఉంది. దానికి సంబంధించి స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్‌, రీరికార్డింగ్‌ థియేటర్లు నిర్మించడానికి అవసరమైన మద్దతు ఇవ్వడానికి పాలసీ తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ మాదిరిగానే విశాఖపట్నం అభివృద్థి చేస్తాం. చాలాకాలంగా మూలన పడిపోయిన నంది అవార్డులను పునరుద్థరిస్తాం. అతి తర్వలో ఆ అవార్డులకు సంబంధించి ప్రకటన ఇస్తాం. పరిశ్రమకు చెందిన ముఖ్యమైన నిర్మాతలు, దర్శకులు, నటులతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. నూటికి నూరు శాతం సినిమా పరిశ్రమ అభివృద్థికి కృషి చేస్తాం’’’ అని అన్నారు.

Updated Date - May 19 , 2025 | 11:17 AM