Nandamuri Balakrishna: యంగ్ లుక్.. బాలయ్య రిస్క్ అవసరమా

ABN , Publish Date - Dec 22 , 2025 | 07:19 PM

'ఐ యామ్ ఒరిజినల్' అంటూ ఆ మధ్య ఇఫ్ఫీ వేడుకలో అన్నారు బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఏఐ వర్క్ తో కానీ, గ్రీన్ మ్యాట్ తో కానీ ఎక్కువగా సాగడం తనకిష్టం లేదని తెలిపారు బాలయ్య.

Nandamuri Balakrishna: 'ఐ యామ్ ఒరిజినల్' అంటూ ఆ మధ్య ఇఫ్ఫీ వేడుకలో అన్నారు బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఏఐ వర్క్ తో కానీ, గ్రీన్ మ్యాట్ తో కానీ ఎక్కువగా సాగడం తనకిష్టం లేదని తెలిపారు బాలయ్య... అందువల్ల తన తాజా చిత్రంలో యంగ్ గా కనిపించడానికి సన్నబడాలని వర్కౌట్స్ చేస్తున్నారట. నిజానికి ఈ మధ్య ఎందరో ఏజ్డ్ హీరోస్ యంగ్ లుక్ కోసం 'ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్'తో ఒకప్పటి తమ రూపాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. గోపీచంద్ మలినేని(Gopichand Malineni) డైరెక్షన్ లో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. అలా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య మహరాజుగా కనిపిస్తారు. అలాగే ఓ స్పెషల్ ఎపిసోడ్ లో యంగ్ గా కనిపించాలి. ఈ నేపథ్యంలోనే బాలయ్య వర్కౌట్స్ చేస్తున్నారని టాక్.

ఇంతకు ముందు బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బంపర్ హిట్ గా నిలచింది. అందువల్ల తమ రెండో సినిమాను సైతం అందరినీ అలరించేలా రూపొందించేందుకు గోపీచంద్ కృషి చేస్తున్నారు. నయనతార నాయికగా నటిస్తున్న ఈ సినిమా బాలయ్యకు 111వ చిత్రం. ఇది అన్నివర్గాల వారిని ఆకట్టుకొనేలా తెరకెక్కుతోందని గోపీచంద్ మలినేని అంటున్నారు.

అయితే ఇక్కడ సమస్య బాలకృష్ణ వయస్సు. ప్రస్తుతం ఆయన వయస్సు 65. మిగతా హీరోలు మొదటి నుంచి జిమ్ కి వెళ్లడం, వర్క్ అవుట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ, బాలయ్య మాత్రం యోగా తప్ప జిమ్ కి వెళ్లినట్లు ఎప్పుడు చూడలేదు. ఈ సినిమాకోసం ఆయన వర్కవుట్స్ చేయనున్నట్లు సమాచారం. బాలయ్య ఒరిజినల్ గా కనిపించాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈ వయస్సులో రిస్క్ తీసుకోవడం ఆయన ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ వయస్సులో ఇలాంటివి వద్దని నందమూరి ఫ్యాన్స్ బాలయ్యకి చెప్తున్నారు. ఇక ఒకసారి అనుకుంటే అది పూర్తీ అయ్యేవరకు వదలని బాలయ్య.. ఈ మూవీలో ఏ తీరున యంగ్ లుక్ లో ఆకట్టుకుంటారో చూడాలి..

Updated Date - Dec 22 , 2025 | 07:22 PM