Nandamuri Balakrishna: జై బాలయ్య.. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే విన్నా
ABN , Publish Date - Dec 03 , 2025 | 08:40 PM
అభిమానులందరూ బాలయ్య (Nandamuri Balakrishna) అభిమానులు వేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాలయ్య కొట్టినా దాన్ని ఆశీర్వాదం అనుకొనే అభిమానులు ఆయనకు తప్ప ఇంకెవరికీ ఉండరు.
Nandamuri Balakrishna: అభిమానులందరూ బాలయ్య (Nandamuri Balakrishna) అభిమానులు వేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాలయ్య కొట్టినా దాన్ని ఆశీర్వాదం అనుకొనే అభిమానులు ఆయనకు తప్ప ఇంకెవరికీ ఉండరు. జై బాలయ్య అనే పదంలో ఒక ఎనర్జీ ఉంటుంది.. ఆ మాట అంటే ఒక దైర్యం వస్తుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తారు. బాలయ్య కూడా ఫ్యాన్స్ ని అలాగే చూస్తాడు. కొట్టినా.. తిట్టినా తన అభిమానులు అంటే బాలయ్యకు ఎంతో ప్రాణం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం అఖండ 2.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న నాలుగవ చిత్రం అఖండ 2. ఇక ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ గా అఖండ 2 రిలీజ్ అవుతుంది అంటే ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ ను కూడా క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
ఇక అఖండ 2 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం హిందీ, తమిళ్ అనే తేడా లేకుండా వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమా గురించే కాకుండా పర్సనల్ విషయాలను కూడా చెప్పుకొచ్చారు. ఒక ఇంటర్వ్యూ యాంకర్.. మీ సినిమా ఈవెంట్స్ ఎక్కడ జరిగినా జై బాలయ్య అనే పదం వినబడుతుంది. మీరు మొదటి సారి జై బాలయ్య అనే పదం ఎప్పుడు విన్నారు.. ? అన్న ప్రశ్నకు బాలయ్య మాట్లాడుతూ.. ' మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మొదటిసారి ఆ పదం విన్నాను, అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో విన్నట్లు, నేను కూడా జై బాలయ్య విన్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.