Akkineni Nagarjuna: యో.. కింగూ.. ఇదయ్యా నీ అసలు విశ్వరూపం

ABN , Publish Date - Aug 02 , 2025 | 10:02 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు ఏ సినిమా మీద ఉంది అంటే టక్కున కూలీ (Coolie) అని చెప్పుకొచ్చేస్తున్నారు. కూలీ సినిమా ఈ రేంజ్ హైప్ రావడానికి కారణాలు ఎన్ని ఉన్నా.. తెలుగువారి ప్రధాన కారణం మాత్రం అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.

Coolie Movie

Akkineni Nagarjuna: ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు ఏ సినిమా మీద ఉంది అంటే టక్కున కూలీ (Coolie) అని చెప్పుకొచ్చేస్తున్నారు. కూలీ సినిమా ఈ రేంజ్ హైప్ రావడానికి కారణాలు ఎన్ని ఉన్నా.. తెలుగువారి ప్రధాన కారణం మాత్రం అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రజినీ ఒక్కడు ఉంటేనే సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకుతాయి. అలాంటింది రజినీ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ నటిస్తే.. అందులో కింగ్ నాగార్జున విలన్ గా కనిపిస్తే.. ఎలా ఉంటుంది. ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం.


స్టార్ హీరోలందరూ ఎంత వయస్సు వచ్చినా హీరోలుగానే కొనసాగాలని వరుస సినిమాలతో బిజీగా మారితే .. నాగ్ మాత్రం కొత్త దారి వేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే సపోర్టివ్ రోల్ లో కుబేర సినిమాలో కనిపించాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. నిజం చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్రకు అంత ప్రశంస దక్కలేదనే చెప్పాలి. అందుకు కారణం పాత్ర. ధనుష్ పాత్రనే అందులో ఎక్కువ హైలైట్ అవ్వడంతో.. నాగ్ పాత్ర తేలిపోయింది. అందులోనూ క్లైమాక్స్ లో నాగ్ పాత్రకు ప్రాముఖ్యతనే లేకుండా పోయింది. దీంతో నాగ్ పాత్రపై ఫ్యాన్స్ పెదవి విరిచారు.


ధనుష్ వలన కుబేర హిట్ అయ్యింది అనుకుంటే.. అది నాగ్ ఖాతాలో పడినట్టే. సరే అది అయిపోయింది. ఇక ఇప్పుడు అందరూ కూలీ మీద పడ్డారు. లోకేష్.. రజినీ కంటే ఎక్కవ నాగార్జునను అడిగి మరీ ఒప్పించిన పాత్ర సైమన్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా కూలీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా నాగార్జున లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ' ఒకడు పుట్టగానే వాడు ఎవడు చేతిలో చావాలనేది తల మీద రాసీ పెట్టి ఉంటుంది' అని నాగ్ చెప్పే డైలాగ్ తోనే ట్రైలర్ మొదలయ్యింది.


ట్రైలర్ మొదటి నుంచి చివరివరకు నాగార్జునను స్టైలిష్ లుక్ లోనే చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సైమన్ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.క్రూరమైన మైండ్ ఉన్న బిజినెస్ మ్యాన్ గా నాగ్ ఈ సినిమాలో కనిపించాడు. ఆ రక్తపాతం, గొడవలు.. నాగ్ కు ఎవరెవరికి మధ్య ఉంటాయో తెలియాల్సి ఉంది. ట్రైలర్ ను బట్టి.. నాగార్జున గ్యాంగ్ లో సౌబిన్, ఉపేంద్ర ఉండగా.. రజినీ వెనుక సత్యరాజ్ ఉన్నట్లు తెలుస్తోంది. నాగ్ పొటెన్షియాలిటీకి సరైన పాత్ర అంటే ఇది.. ఇదే కింగ్ అసలైన విశ్వరూపం అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా మొట్టమొదటిసారి నాగ్మ.. విలనిజం కోసం తన ప్రినిసిపాల్స్ అన్ని పక్కన. పెట్టి బూతులు మాట్లాడాడట. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Updated Date - Aug 02 , 2025 | 10:02 PM