Nagarjuna - Shiva: పాత్‌ బ్రేకింగ్‌ సినిమా.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు..

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:05 PM

నాగార్జున (Nagarjuna) నటించిన 'శివ' (Shiva) సినిమా టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో 1989లో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది.

Shiva Movie

నాగార్జున (Nagarjuna) నటించిన 'శివ' (Shiva) సినిమా టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో 1989లో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ‘శివ’ సినిమాకు ముందు ఆ తర్వాత అనేంతగా ఎఫెక్ట్‌ చూసిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ సినిమాకు అదే క్రేజ్‌ ఉంది. ఇప్పుడీ చిత్రం మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్దమవుతోంది.  అక్కినేని నాగేశ్వరరావు (ANR) జయంతి సందర్భంగా నాగార్జున దీనిని రీ రిలీజ్‌ చేయనున్నారు. 4కే వెర్షన్‌లో కన్వర్ట్‌ చేసి నవంబర్‌ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నాగార్జున్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.


ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ
‘కొన్ని సినిమాలు తరాలు మారినా కొత్తగానే ఉంటాయని నాన్న అనేవారు. ‘శివ’ సినిమా అలాంటి వాటిల్లో ఒకటి. వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాను 4కేలో రిలీజ్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మోనో మిక్స్‌ నుంచి డాల్బీ ఎట్మాస్‌కు మార్చడం జరిగింది. బిగ్‌ స్ర్కీన్‌ మీద ఈ చిత్రాన్ని కొత్త తరహాలో ఆస్వాదించండి. ఇది నాన్నకు మా నివాళి’ అని అన్నారు. 

Updated Date - Sep 20 , 2025 | 01:18 PM