Nagarjuna Interview: మూడు సొసైటీల మధ్య క్లాష్.. సొసైటీకి ఈ కథ అవసరం
ABN , Publish Date - Jun 19 , 2025 | 05:40 PM
శేఖర్ కమ్ములతో వర్క్ చేయాలని చాలాకాలంగా ఉంది. ఆనంద్ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన కథల్లో సోషల్ రిలవెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్‌గానే ఉంటాయి.
"మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను స్టార్స్‌తో కలిసి సినిమాలు చేశాను. నాన్నగారు(ఏఎన్ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్‌బాబు గారు.. ఇలా అంత మంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అందుకే నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటా’’ అని అక్కినేని నాగార్జున (King Nagarjuna) అన్నారు. ధనుష్(Dhanush)తో కలిసి శేఖర్ కమ్ముల (Sekhar kammula)దర్శకత్వం వహించిన చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నాగార్జున్ విలేకర్లతో మాట్లాడారు.
మైండ్‌లో ఎప్పటి నుంచో...
శేఖర్ కమ్ములతో వర్క్ చేయాలని చాలాకాలంగా ఉంది. ఆనంద్ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన కథల్లో సోషల్ రిలవెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్‌గానే ఉంటాయి. చక్కని పాటలు ఉంటాయి. ఆయన దర్శకత్వం శైలి నాకు ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్న సినిమా ఇప్పటికి కుదిరింది. కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్ గారికి ఈ పాయింట్ మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాల్లో మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. అల్ర్టారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది. దేవిశ్రీ సంగీతం లో ప్రతి పాట సందర్భానుసారంగా వస్తాయి. ఈ సినిమాకు సంగీతం చాలా ముఖ్యం. దేవి వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.
ప్రతీది కొత్తగానే ఉంటుంది..
ఈ సినిమాలో నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. ిసీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపిస్తా.. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్.. అన్ని కూడా కొత్తగా ఉంటాయి. క్యారెక్టర్స్‌లో చాలా షేడ్స్ వుంటాయి. ఈ సినిమాలో రెగ్యులర్ స్క్రీన్ ప్లే ఉండదు. రొటీన్ క్యారెక్టర్స్ కావు. ప్రతీది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో హీరోయిన్ అనడానికి లేదు. అన్ని పాత్రలుగానే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి. శేఖర్ నా క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా రాశారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్‌కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇది. రియల్ లైఫ్‌కి రిలేటెడ్ గా ఇందులో చాలా ఇన్నిడెంట్స్ ఉంటాయి. అయితే నా పాత్ర కోసం శేఖర్ చేసిన మార్పులు ఏమీ లేవు. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మా ఇంట్లో అందరూ శేఖర్‌తో సినిమాలు చేశారు. చైతూని అడిగా శేఖర్ వర్కింగ్ స్టైల్ గురించి. ‘ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారని’ చెప్పాడు. అది నిజమే అని సెట్లోకి వెళ్లిన రోజే అర్థమైంది.
ఇక నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్‌గారు ఓ పెద్ద సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుని ఈ సినిమా చేశారు. ఇద్దరూ పాషన్ ఉన్న నిర్మాతలే. డైరెక్టర్ శేఖర్ కమ్ము?కి కావాల్సినది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో సినిమా తీశారు.
కింగ్ 100 ప్లాన్స్ జరుగుతున్నాయి..
కూలీలో పాత్ర కూడా కొత్తగా ఉంటుంది. లోకేష్ కనకరాజ్ కంప్లీట్ న్యూ ఏజ్ డైరెక్టర్. క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు సితార , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇలా అన్ని బ్యానర్లో సినిమాలు చేయాలని ఉంది. అలా ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇక పాన్ ఇండియా ట్రెండ్ విషయానికొస్తే.. అలా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు. పాన్ ఇండియా సినిమా అని తీసినవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం లేదు. ప్రస్తుతం నా 100వ సినిమా ప్లానింగ్‌లో ఉన్నాం. వర్కింగ్ టైటిల్ కింగ్ 100 అని పెట్టారు.