మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు విందు.. హాజరైన నాగార్జున, సినీ సెలబ్రిటీలు
ABN , Publish Date - May 14 , 2025 | 08:03 AM
హైదరాబాద్ వేదికగా మొట్ట మొదటిసారిగా ప్రపంచ సుందరీమణుల సెలక్షన్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ (Hyderabad) వేదికగా మొట్ట మొదటిసారిగా ప్రపంచ సుందరీమణుల (Miss World2025) సెలక్షన్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం పదిరోజులుగా 109 దేశాల అందగత్తెలు హైదరాబాద్‌లో సందడి చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలు విజిట్ చేస్తున్నారు.
ఈక్రమంలో ఇప్పటికే నాగార్జున పాగర్, చార్మినార్, బుద్దవనం, వంటి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం సారథ్యంలో మంగళవారం రాత్రి ప్రముఖ చౌముల్లా ప్యాలెస్ (Chowmahalla Palace) లో కంటెస్టెంట్లకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన భార్య, కుమార్తె నైమిషా రెడ్డిలతో రాగా, మంత్రులు, సినీ సెలబ్రిటీలు నాగార్జున (Nagarjuna Akkineni), సురేశ్ బాబు (Suresh babu), అల్లు అరవింద్ (Allu Aravind) ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.