Nagababu: అంజనమ్మకు అస్వస్థత.. స్పందించిన నాగబాబు
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:39 PM
మెగా బ్రదర్స్ తల్లి అంజనా దేవి ( Anjana Devi)కి అస్వస్థత అంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అంజనమ్మకు అనారోగ్యం అని, వెంటనే చికిత్స కోసం అపోలోకి తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి.
Nagababu: మెగా బ్రదర్స్ తల్లి అంజనా దేవి ( Anjana Devi)కి అస్వస్థత అంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అంజనమ్మకు అనారోగ్యం అని, వెంటనే చికిత్స కోసం అపోలోకి తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం కేబినెట్ మీటింగ్ ను మధ్యలో వదిలేసి మరీ హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా నిర్మాత SKN సైతం గెట్ వెల్ సూన్ అంజనమ్మ అని పోస్ట్ చేసి డిలీట్ చేయడంతో అందరూ నిజమే అనుకున్నారు.
పవన్ సైతం హుటాహుటినా వెళ్ళాడు అంటే సీరియస్ ఏమో అని మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించాడు. ఉదయం నుంచి వస్తున్న వార్తలు అన్ని కూడా వదంతులే అని తెలిపాడు. అమ్మ ఆరోగ్యంగానే ఉందని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ను నమ్మొద్దని తెలిపాడు.
'అమ్మ ఆరోగ్యం చాలా బావుంది. కొంత తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. కానీ, అమ్మ చాలా క్షేమంగా ఉంది' అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులకు చెప్పుకొచ్చాడు. ఇక నాగబాబు స్పందించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.