Naga Vamsi: ఇది మనందరి సినిమా..  

ABN , Publish Date - Jan 04 , 2025 | 08:38 PM

సినీప్రియులను ఉద్దేశించి నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘‘ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్‌ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కావడానికి ప్రయత్నిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు.


సినీప్రియులను ఉద్దేశించి నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘‘ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్‌ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కావడానికి ప్రయత్నిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. బాలకృష్ణ (NBK) హీరోగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన ‘డాకు మహారాజ్‌’ (Daaku Mahaaraju) సంక్రాంతికి విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా రూపొందిన ఈచిత్రంలో. శ్రద్థా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. బాబీ దేవోల్‌, చాందిని చౌదరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది రిలీజ్‌ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. ఇందులోని సెకండాఫ్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటుందని.. అది ‘సమర సింహారెడ్డి’ ఫైట్‌ తరహా ఎపిసోడ్‌లా ఉంటుందని.. అభిమానులు  తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. యూఎస్‌ వేదికగా ‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది.  

Updated Date - Jan 04 , 2025 | 08:38 PM