Naga Vamsi: ఏమైనా అనుకోండి.. పొరపాటు చేసింది

ABN , Publish Date - Jan 09 , 2025 | 06:58 AM

Naga Vamsi: ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ మీదున్న ప్రొడ్యూసర్ నాగ వంశీ.. ట్రోల్స్, క్రిటిసిజం, కాంట్రవర్సీ ఏదైనా తన స్టైల్‌లో డీల్ చేస్తారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా స్టోరీ, 'దబిడి దిబిడి' సాంగ్ ట్రోల్స్ గురించి పలు విమర్శలు ఎదురయ్యాయి. వీటిపై ఆయన స్పందిస్తూ.. తన స్టైల్ సమాధానాలు చెప్పారు.

Naga Vamsi on Trolls

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా స్టోరీ, 'దబిడి దిబిడి' సాంగ్ ట్రోల్స్ గురించి పలు విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత నాగ వంశీ వీటీపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.


తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మీడియా ఆయనను ప్రశ్నిస్తూ.. ఈ సినిమాలో 'దబిడి దిబిడి' సాంగ్ ట్రోల్స్ కు గురవుతుంది. అయితే ఆ ట్రోల్స్ ని ఊర్వశి రౌతేలా షేర్ చేసింది. దీనిపై మీరేమంటారు అని అడిగారు. దీనిపై నాగ వంశీ మాట్లాడుతూ.. "ఊర్వశి గారికి తెలుగు సరిగ్గా అర్థంకాక మీరంతా పొగిడారని అనుకుని పొరపాటున అలా స్పందించారు. ఆ తరువాత నేను .. బాబీ కలిసి ఆ పోస్టులను తీసేయించాము" అని సమాధానమిచ్చారు.


'మరోవైపు ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ను బట్టి చూస్తే, 'కొండవీటి దొంగ' సినిమా పోలికలు కనిపిస్తున్నాయి.. దీనిపై మీరేమంటారు?' అంటూ అడిగారు . దీనికి నాగవంశీ స్పందిస్తూ .. 'గుర్రం చూసి రిఫరెన్స్ అనుకుంటున్నారా? మంచివాళ్లకు మహారాజు .. చెడ్డ వాళ్లకు డాకు అనే మేము చెప్పాలనుకున్నాం. మీరు 'కొండవీటి దొంగ' అనుకోండి .. రాబిన్ హుడ్ అనుకోండి .. ఇంకా ఏదైనా అనుకోండి' అంటూ తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Updated Date - Jan 09 , 2025 | 07:18 AM