Nabha Natesh: చిట్టి నడుమునే చూపి.. చిత్రహింసలు పెడుతుందే

ABN , Publish Date - Oct 10 , 2025 | 10:11 PM

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల భామ నభా నటేష్ (Nabha Natesh).

Nabha Natesh

Nabha Natesh: నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల భామ నభా నటేష్ (Nabha Natesh). మొదటి సినిమాలో అల్లరిపిల్లగా కనిపించి తెలుగు ప్రేక్షకుల దృష్టిలో బాగానే పడింది. ఈ సినిమా తరువాత అమ్మడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. తెలంగాణ పోరి చాందినీగా నభా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తరువాత ఈ చిన్నదాన్ని ఎవరు ఆపలేరు అనుకున్నారు. కానీ, అన్ని అనుకున్నట్లు జరిగితే జీవితం అవ్వదు కదా. అలాగే నభాకు అవకాశాలు వచ్చాయి కానీ, ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు.

Nabaha Natesh


2021 తరువాత ఈ చిన్నది వెండితెరపైనే కాదు ఇండస్ట్రీలో కూడా ఎక్కడా కనిపించలేదు. ఒక పెద్ద యాక్సిడెంట్.. దాని నుంచి కోలుకోవడానికి సమయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.

Nabaha Natesh

ఇక రీఎంట్రీలో సినిమాలతో బిజీగా ఉంటుంది అనుకుంటే ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించింది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకును గిలిగింతలు పెడుతూ వారి కంటికి కునుకే లేకుండా చేస్తుంది.

Nabaha Natesh


పండగ వస్తే పద్దతిగా.. వీకెండ్ వస్తే వెరీ హాట్ గా ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. ఇక తాజాగా నభా చీరకట్టులో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. నిండుగా చీరకట్టుకొని.. నడుము అందాలను ఎరగా వేసి.. కవ్వించే చూపులతో కైపెక్కించింది. కాటుక కళ్లను చూస్తూనే మత్తెక్కిపోయే ఫ్యాన్స్ కు.. ఏకంగా నడుము అందాలను చూపించి షేక్ అయ్యేలా చేసింది.

Nabaha Natesh

అంతటి అందాన్ని అలా చూసేసరికి ఫ్యాన్స్ చూపు తిప్పుకోలేకపోతున్నారు. అందమే అసూయ పడేలా ఉందే అని కొందరు.. చిట్టి నడుమును చూపి.. చిత్రహింస చేస్తుందే అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Oct 11 , 2025 | 07:29 AM