Shambhala: గీతా మాధురి.. ‘నా పేరు శంబాల’ సాంగ్ విడుదల

ABN , Publish Date - Dec 16 , 2025 | 09:11 AM

విడుదలకు ముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్న చిత్రంగా ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ నిలుస్తోంది.

Shambala

విడుదలకు ముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్న చిత్రంగా ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ (Shambhala: A Mystical World) నిలుస్తోంది. వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కథానాయకుడిగా నటించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం రిలీజ్‌కు ముందే అన్ని ప్రధాన డీల్స్ క్లోజ్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. అర్చన అయ్యర్ (Archana Iyer), స్వసిక (Swasika Vijay), రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు.

‘శంబాల’ అనే టైటిల్ అనౌన్స్ చేసిన క్షణం నుంచే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో, టీజర్, ట్రైలర్l కలిసి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. డిఫరెంట్ ప్రమోషన్ స్ట్రాటజీలతో చిత్ర బృందం సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్తోంది. అయితే.. ఈ మధ్య చాలా క్రేజీ సినిమాలకు కూడా ఓటీటీ డీల్ ఫైనల్ కాకుండా ఉండగా, ‘శంబాల’ మాత్రం విడుదలకు ముందే అన్ని హక్కులను ఫాన్సీ రేట్లకే అమ్ముడుపోయి ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా దక్కించుకోగా, శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా పేరు శంబాల’ (Naa Peru Shambhala) అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ గాయని గీతా మాధురి (Geetha Madhuri) ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada) రాసిన లిరిక్స్‌కు, శ్రీ చరణ్ పాకాల (Sricharan Pakala) అందించిన స్వరాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్పెషల్‌గా రూపొందించిన లిరికల్ వీడియోలో గీతా మాధురి కనిపించిన తీరు, విజువల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాటలోని మిస్టికల్ ఫీల్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. అయితే.. ఇటీవ‌ల అఖండ సినిమాలోని జాజికాయ పాట‌లోనూ గీతా మాధురి గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌డం విశేషం.

ఈ చిత్రాన్ని నిర్మాతలు రాజీ లేకుండా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ప్రవీణ్ కె. బంగారి అందించిన విజువల్స్ సినిమాకు విజువల్ గ్రాండ్యూర్‌ను తీసుకురాగా, శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం కథను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. పాన్ ఇండియన్ అప్పీల్ ఉన్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదలకు ముందే ఏర్పడిన బజ్‌ను బట్టి ‘శంబాల’ బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Dec 16 , 2025 | 09:20 AM