Bad Boy: నా మావ పిల్లనిత్తానన్నాడే...
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:06 AM
నాగశౌర్య, నిధి జంటగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. రామ్ దేశినా రమేశ్ దర్శకత్వంలో
నాగశౌర్య, నిధి జంటగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశినా(రమేశ్) దర్శకత్వంలో శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా మావ పిల్లనిత్తానన్నాడే...’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యానికి హరిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు. కారుణ్య, హరిప్రియ ఆలపించారు. పాటలో నాగశౌర్య, నిధి స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి.