నిజ జీవిత ఘటనల ఆధారంగా..
ABN , Publish Date - Aug 16 , 2025 | 05:25 AM
రమణ్, వర్ష విశ్వనాథ్ జంటగా రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ టైమ్’ దీని ట్యాగ్‌లైన్. ఎలికా(గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మిస్తున్నారు.
రమణ్, వర్ష విశ్వనాథ్ జంటగా రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ టైమ్’ దీని ట్యాగ్‌లైన్. ఎలికా(గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్లను సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ఆవిష్కరించి చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ ‘నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రామచంద్ర, హీరో రమణ్ తదితరులు పాల్గొన్నారు.