OG Movie: జపనీస్ మ్యూజిక్ బీట్ అదిరిందిగా...
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:50 PM
సంగీత దర్శకుడు థమన్ 'ఓజీ' చిత్రానికి సంబంధించిన ఓ సర్ప్రైజ్ ను విడుదల చేసారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’ (OG). ప్రియాంక మోహన్ కథానాయిక. ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. అయన ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ కు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోరుతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇపుడే వాటికి దీటుగా ఉండేలా తమన్ జపనీస్ మ్యూజిక్ బీట్‌ను విడుదల చేశారు. ఇది ‘ఓజీ’ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే బీట్ అని తెలిపారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.