Sricharan Pakala: ‘శంభాల’ లాంటి.. సైంటిఫిక్‌, మైథలాజికల్‌ థ్రిల్లర్‌కు పని చేయడం కొత్తగా ఉంది

ABN , Publish Date - Dec 19 , 2025 | 06:14 AM

ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘శంభాల’ (Shambhala) ఈ నెల 25న విడుదలవుతోంది.

Sricharan Pakala

ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘శంభాల’ (Shambhala) ఈ నెల 25న విడుదలవుతోంది. అర్చన అయ్యర్ (Archana Iyer), స్వసిక (Swasika), రవివర్మ, మధునందన్‌, శివ కార్తీక్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. యుగంధర్‌ ముని ( Ugandhar Muni) దర్శకత్వంలో రాజశేఖర్‌ అన్నభిమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల (Sricharan Pakala) చిత్ర విశేషాలు పంచుకున్నారు.

శ్రీచరణ్ మాట్లాడుతూ.. ‘శంబాలలో చాలా థీమ్స్‌ ఉంటాయి. దర్శకుడు కథ చెప్పిన మరుసటి రోజు నుంచే వర్క్‌ స్టార్ట్‌ చేశా. దర్శకుడు యుగంధర్‌కు సౌండింగ్‌ మీద మంచి నాలెడ్జ్‌ ఉంది. నేను ఎన్నో థ్రిల్లర్స్‌కు పని చేశా. కానీ ‘శంభాల’లాంటి సైంటిఫిక్‌, మైథలాజికల్‌ థ్రిల్లర్‌కు పని చేయడం కొత్తగా అనిపించింది’ అన్నారు. చిన్నప్పటి నుంచి పౌరాణిక కథలు వింటూ పెరిగాననీ, ఇప్పుడు ఆ జానర్‌లో వచ్చిన కథకు సంగీతం అందించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

‘శంబాల’ చిత్రం కోసం రకరకాల వాయిద్యాలు ఉపయోగించినట్లు శ్రీచరణ్‌ చెప్పారు. సినిమాలో పాటలు బాగా వచ్చాయనీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. ‘సౌండ్‌ డిజైనింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్‌ వస్తుంది. నా వాయిస్‌తోనే రకరకాల సౌండ్స్‌ ఇచ్చా. అవన్నీ దర్శకుడు యుగంధర్‌కు నచ్చాయి’ అని చెప్పారు. ‘శంబాల’ తనకు 49వ చిత్రమనీ, 50వ సినిమా ‘అనుమానపు పక్షి’ అనీ ఈ రెండూ తనకు ప్రత్యేకం అని శ్రీచరణ్‌ చెప్పారు.

Updated Date - Dec 19 , 2025 | 06:34 AM