M TV: షాకింగ్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

ABN , Publish Date - Oct 15 , 2025 | 06:01 AM

సంగీతప్రియులకు షాక్! ఎమ్‌టీవీ పారామౌంట్‌ గ్లోబల్‌ డిసెంబర్‌ 31 తర్వాత ‘ఎమ్‌టీవీ మ్యూజిక్’, ‘ఎమ్‌టీవీ 80స్’, ‘ఎమ్‌టీవీ 90స్’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ లైవ్‌’ వంటి సంగీత ఛానళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

M Tv

సంగీత ప్రియుల్ని, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకున్న ప్రముఖ టీవీ ఛానల్‌ ఎమ్‌టీవీ (M TV ) ఒక షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ ఎమ్‌టీవీ పారామోంట్‌ గ్లోబల్‌ ద్వారా నలభయేళ్లకు పైగా సంగీత ప్రసారాలను అందించిన అనుబంధ ఛానళ్లను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

‘ఎమ్‌టీవీ మ్యూజిక్‌’, ‘ఎమ్‌టీవీ 80స్‌’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ 90స్‌’. ‘ఎమ్‌టీవీ లైవ్‌’ సంగీత ఛానళ్లను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబరు 31 తర్వాత ఆ ఛానళ్లు అందుబాటులో ఉండవని పేర్కొంది. అయితే, రియాలిటీ షోలను అందించే ఎమ్‌టీవీ హెచ్‌డీ మాత్రం యధావిధిగా కొనసాగుతుందని తెలిపింది.

M Tv

స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక ఈ ఛానళ్లకు ఆదరణ తగ్గడం, యూట్యూబ్‌, టిక్‌టాక్‌, స్పాటిఫై వంటి సంగీతం అందించే యాప్స్‌తో పోటీపడలేకపోవడం ఈ నిర్ణయానికి కారణం అని తెలుస్తోంది. అయితే, ఇటీవలె ఎమ్‌టీవీ పారామౌంట్‌ గ్లోబల్‌ సంస్థ, స్కై డాన్స్‌ మీడియాతో విలీనమైంది. 1981లో అమెరికాలో ఎమ్‌టీవీని స్థాపించారు.

Updated Date - Oct 15 , 2025 | 06:01 AM