Mrunal Thakur: ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:12 PM
ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా.. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ని చూస్తే ఎవ్వరైనా ఈ పాట పాడాల్సిందే.
Mrunal Thakur: ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా.. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ని చూస్తే ఎవ్వరైనా ఈ పాట పాడాల్సిందే. అందం, అభినయం ఉన్న నటీమణుల్లో మృణాల్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మృన్ల. అందులో సీత పాత్రలో నటించినా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం మృణాల్ ని నిజంగానే సీతగా తమ గుండెల్లో దాచుకున్నారు. హిట్ వచ్చింది కదా అని ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు కాకుండా కథకు, తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది.
ఇక మృణాల్ నటించిన హాయ్ నాన్న మంచి విజయాన్ని అందించినా.. ది ఫ్యామిలీ స్టార్ పరాజయాన్ని మిగిల్చింది. ఒకపక్క తెలుగులో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ చిన్నది హిందీలో కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంచుకుంటుంది. ప్రస్తుతం మృణాల్ తెలుగులో డెకాయిట్ సినిమాలో నటిస్తోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గాసిప్స్ తో ఈ చిన్నది ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది.
కొన్నిరోజుల క్రితం మృణాల్.. ధనుష్ తో ప్రేమలో ఉందని మాట్లాడుకున్నారు. ఆ తరువాత క్రికెటర్ ప్రేమలో మునిగితేలుతోందని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లకు మాత్రం ఈ సీత.. చాలా కామ్ గా చెక్ పెట్టింది. ఇలాంటివి విన్నప్పుడు సరదాగా ఉంటుంది.. నవ్వుకుంటాం అని చెప్పి అవన్నీ రూమర్స్ అని కొట్టిపడేసింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హల్చల్ చేసే మృణాల్.. తాజాగా మరాఠీ వస్త్రధారణలో అలరించింది. నిండుగా చీరకట్టుకొని, కొప్పున పూలు చుట్టి ఎంతో అందంగా కనిపించింది. ఇక ఈ ఫోటోలకు కొద్దిగా మోడ్రన్.. పూర్తిగా మరాఠీ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ సేమ్ ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనే పాటను పాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.