Mowgli: నెల తిరక్కుండానే ఓటీటీకి వచ్చేసిన సుమ కొడుకు సినిమా..

ABN , Publish Date - Dec 26 , 2025 | 07:10 PM

యాంకర్ సుమ (Suma) వారసుడిగా బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రోషన్ కనకాల (Roshan Kanakala). మొదటి సినిమాతోనే హిట్ అందుకోలేనప్పటికీ నటన విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు.

Mowgli

Mowgli: యాంకర్ సుమ (Suma) వారసుడిగా బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రోషన్ కనకాల (Roshan Kanakala). మొదటి సినిమాతోనే హిట్ అందుకోలేనప్పటికీ నటన విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ సినిమా తరువాత రెండో సినిమాకు కొద్దిగా గ్యాప్ తీసుకొని మోగ్లీ (Mowgli) తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటించగా.. నటుడు, డైరెక్టర్ అయిన బండి సరోజ్ కుమార్ విలన్ గా నటించాడు.

మొదటి నుంచి ఈ సినిమాను డిసెంబర్ 12 న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఆరోజున అఖండ 2 రిలీజ్ అవుతుందని సందీప్ ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను తానే నిందించుకున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్ఠపడినట్లు తెలిపాడు. ఇక అఖండ 2 తో పోటీ ఎందుకని.. వేరే డేట్ ను ఫిక్స్ చేసుకుంటుందేమో అనుకున్నారు కానీ, మోగ్లీ మాత్రం ఆ తరువాత రోజు అనగా డిసెంబర్ 13 నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మోగ్లీ మిక్స్డ్ టాక్ ను అందుకుంది. కొంతమందికి సినిమా బాగా నచ్చింది. ఇంకొంతమంది మాత్రం పెదవి విరిచారు. ముఖ్యంగా బండి సరోజ్ కుమార్ నటన మాత్రం హైలైట్ అని చెప్పుకొచ్చారు.

ఇక మిక్స్డ్ టాక్ అందుకోవడంతో మోగ్లీ నెల తిరక్కుండానే ఓటీటీలో ప్రత్యేక్షమవ్వడానికి సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ కొనుగోలు చేసింది. ఇక తాజాగా మోగ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. కొత్త సంవత్సరం కానుకగా మోగ్లీ జనవరి 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్ లో మోత మోగించని ఈ సినిమా ఓటీటీలో అయినా సౌండ్ చేస్తుందేమో చూడాలి.

Updated Date - Dec 26 , 2025 | 07:10 PM