Breaking: i BOMMA ఓన‌ర్‌.. ఇమ్మడి రవి అరెస్ట్

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:11 AM

సినీ పరిశ్రమను వణికించిన, వ‌ణికిస్తున్న‌ పైరసీ వెబ్‌సైట్ iBOMMA కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

iBOMMA

సినీ పరిశ్రమను వణికించిన, వ‌ణికిస్తున్న‌ పైరసీ వెబ్‌సైట్ iBOMMA కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని CCS పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే కూకట్‌పల్లి ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవలే పలువురు తెలుగు సినీ నిర్మాతలు iBOMMAపై అధికారికంగా ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. సినిమా విడుదల‌కు ముందే కంటెంట్‌ లీక్‌ అవుతుండటంతో భారీ నష్టాలు వాటిల్లుతున్నాయంటూ దర్యాప్తును వేగవంతం చేయాలని, కార‌కుల‌ను ప‌ట్టుకోవాల‌ని కోరారు. ఆ ఫిర్యాదుల ఆధారంగానే CCS పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో కేసు ఇన్వెస్టిగేష‌న్ స్టార్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే నిందితుడు సోషల్ మీడియాలో, టెలిగ్రామ్ ఛానళ్లలో ‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ పరోక్షంగా పోలీసులకు సవాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో..పోలీసులు దర్యాప్తు వేగ‌గంతం చేయ‌గా ఇమ్మడి రవి కరేబియన్‌ దీవుల్లో స్థిరపడి అక్కడి నుంచే iBOMMA వెబ్‌సైట్‌ను రిమోట్‌గా నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది. అక్కడి సర్వర్లు, డిజిటల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి పైరసీ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నాడని అధికారులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఆయ‌న రాక‌పోక‌ల‌పై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం రాత్రి ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే కూకట్‌పల్లి ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అంతేగాక ర‌వి అరెస్టు అనంతరం ఇమ్మడి రవి నిర్వహిస్తున్న ఖాతాలపై తనిఖీ చేపట్టిన అధికారులు రూ. 3 కోట్లు పైగా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. ఈ డబ్బు iBOMMA కార్యకలాపాల ద్వారా వచ్చినదేనని అనుమానిస్తున్నారు. ఇదిలాఉంటే.. iBOMMA కార్యకలాపాల్లో మరికొందరు వ్యక్తులు కూడా భాగమై ఉన్నారనే అనుమానాల నేపధ్యంలో వారికి సంబంధించిన డేటాను పోలీసులు ఇప్పటికే సేకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 15 , 2025 | 10:26 AM