Chiranjeevi: రగులుతోంది మొగలి పొద రీమిక్స్.. నిజమైన నాగినినే దింపుతున్నారుగా
ABN , Publish Date - Jul 13 , 2025 | 08:47 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిసున్న చిత్రాల్లో విశ్వంభర (Vishwambhara) ఒకటి. బింబిసార సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మొట్ట మొదటిసారి యూవీ క్రియేషన్స్ చిరు సినిమాను నిర్మిస్తుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిసున్న చిత్రాల్లో విశ్వంభర (Vishwambhara) ఒకటి. బింబిసార సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మొట్ట మొదటిసారి యూవీ క్రియేషన్స్ చిరు సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సినిమా మాత్రం ఇంకా రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసుకోలేదు. అదుకో వస్తుంది.. ఇదిగో వస్తుంది అని చెప్పడమే కానీ, ఇప్పటివరకు రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించలేదు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఇంకా అవ్వలేదని, అది అయ్యాకే రిలీజ్ చేయనున్నారని టాక్. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంచి మంచి డేట్స్ ను వదిలేసుకుంది విశ్వంభర. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమాలోని ఐటెంసాంగ్ గురించి కొన్నిరోజుల నుంచే పెద్ద చర్చనే నడుస్తోంది. చిరుతో స్టెప్స్ వేసే ఆ హాట్ బ్యూటీ ఎవరా.. ? అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అది మాత్రమే కాకుండా విశ్వంభర కోసం చిరు హిట్ సినిమా ఖైదీలోని రగులుతోంది మొగలిపొద సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది.
ఇప్పటికీ ఈ సాంగ్ ఓకే ట్రెండ్ సెట్టర్ అంటే అతిశయోక్తి కాదు. అలాంటి సాంగ్ ను చిరునే రీమిక్స్ చేస్తున్నాడు అంటే అభిమానులు మరింత హైప్ తెచ్చింది. ఇక ఇలాంటి సాంగ్ లో చిరుతో పాటు చిందేసే భామ ఎవరో అని అనుకున్నారు. ఎట్టకేలకు ఆ నాగిని దొరికిపోయింది. ఆమె ఎవరో కాదు అసలైన నాగిని మౌనీ రాయ్. నాగిని సీరియల్ తో ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మౌనీ రాయ్.. ఈ స్పెషల్ సాంగ్ కు వెంటనే సై అన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. ఏదిఏమైనా మౌనీ రాయ్ లాంటి అమ్మడితో చిరు స్టెప్స్ అంటే కన్నుల పండగే అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.