Virgin Boys Teaser: అంతా ముద్దులు, ద్వందార్థాల‌తో నింపేశారుగా

ABN, Publish Date - May 13 , 2025 | 05:19 PM

గీతానంద్, మిత్రాశ‌ర్మ, శ్రీహ‌న్, బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందించిన చిత్రం విర్జిన్ బాయ్స్

virgin

గీతానంద్ ( Geetanand), మిత్రాశ‌ర్మ (Mitraaw Sharma), శ్రీహ‌న్ (Shrihan), బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందించిన చిత్రం విర్జిన్ బాయ్స్ (Virgin Boys). ద‌యానంద్ గ‌డ్డం ఈ సినిమాకు రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్‌. రాజ‌గురు ఫిలంస్ బ్యాన‌ర్‌పై రాజా ద‌ర‌పునేని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్ రిలీజ్ చేశారు.

ఈ టీజ‌ర్‌ను చూస్తే పూర్తిగా నేటి యూల్‌ను టార్గెట్ చేస్తు వాళ్ల లాంగ్వేజ్లో తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. సినిమా మొత్తం అర్థ‌న‌గ్న దృశ్యాలు, డ‌బుల్ మీనింగ్ గైలాగ్స్, ముద్దు సన్నివేశాల‌తో నింపేసిన‌ట్లు తెలుస్తుంది. పైగా ఈ మూవీ ఇండియాస్ మోస్ట్ డేరింగ్ రామ్‌కామ్ అని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఇదిలాఉంటే ఈ మూవీలో క‌థానాయిక‌గా చేసిన మిత్రా శ‌ర్మ గ‌తంలో యూట్యూబ‌ర్ హ‌ర్ష సాయితో మెగా లో డాన్ అంటూ ఓ సినిమా నిర్మిస్తున్న‌ట్లు హాడావుడి చేసింది. ఆపై హ‌ర్ష సాయి లైంగికంగా ఇబ్బంది పెట్టాడంటూ కేసులు సైతం పెట్టిన విష‌యం తెలిసిందే. అలాంటిది స‌డ‌న్‌గా మిత్రాశ‌ర్మ హీరోయిన్‌గా ఈ చిత్రంలో ద‌ర్శ‌ణ‌మివ‌డంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Updated Date - May 13 , 2025 | 05:19 PM