Mirchi Madhavi: ప్రకాష్ రాజ్ భార్య పాత్ర.. ఐదుగురు కమిట్మెంట్ అడిగారు
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:24 PM
టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే నటీమణులు చాలా తక్కువ. సురేఖావాణి, ప్రగతి, రజిత.. ఇలా కొద్దిగా గుర్తింపు ఉన్న నటీమణుల్లో మిర్చి మాధవి (Mirchi Madhavi) కూడా ఒకరు.
Mirchi Madhavi: టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే నటీమణులు చాలా తక్కువ. సురేఖావాణి, ప్రగతి, రజిత.. ఇలా కొద్దిగా గుర్తింపు ఉన్న నటీమణుల్లో మిర్చి మాధవి (Mirchi Madhavi) కూడా ఒకరు. మిర్చి సినిమాలో నాగినీడును ఎదిరించి మాట్లాడి.. తన కొడుకును కాపాడుకొనే తల్లిగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అప్పటి నుంచే ఆమెను అందరూ మిర్చి మాధవిగానే గుర్తుపడతారు. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా గుప్పెడంత మనసు సీరియల్ లో విలన్ గా కూడా మాధవికి పేరు ఉంది.
ప్రస్తుతం అడపదడపా సినిమాల్లో నటిస్తున్న మాధవి ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తాను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ఒక్కరు కాదు ఐదుగురుతో ఉండాలని కమిట్మెంట్ అడిగినట్లు తెలిపింది. ' 100% లవ్ సినిమా తరువాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ప్రకాష్ రాజ్ భార్య పాత్ర ఉందని ఒకరు నాకు కాల్ చేశారు. ఆ వ్యక్తి ఐదుగురు ఉంటారు మీకు ఓకేనా అని అడిగారు. నాకు అసలు అర్ధం కాలేదు. ఆ తరువాత నెమ్మదిగా లేదు అండి.. నేను ఇలా చేయను అని నో చెప్పేశాను. మంచి పాత్ర అంటూ చెప్పుకొచ్చాడు. డబ్బే కావాలి అనుకుంటే ఆ పనులే చేసుకొని బ్రతికేదాన్ని కదా.. అని చెప్పి పెట్టేశాను.
ఇండస్ట్రీలో ఇలాంటివారితో గొడవపడి ప్రయోజనం లేదు. నో అని సింపుల్ గా చెప్పి పక్కకు వచ్చి మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవడమే. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం.. అందుకే ఇండస్ట్రీకి వచ్చాను' అని చెప్పుకొచ్చింది. ఇక మాధవి వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ ఐదుగురు ఎవరు అంటూ నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు.