Korean Kanakaraju: హైదరాబాద్‌లో.. కొరియ‌న్ క‌న‌క‌రాజు

ABN , Publish Date - Oct 26 , 2025 | 07:35 AM

వరుణ్‌ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) ఓ హారర్‌ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.

Korean Kanakaraju

వరుణ్‌ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) ఓ హారర్‌ కామెడీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ‘వీటీ15’ అనేది వర్కింగ్‌ టైటిల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కొరియ‌న్ క‌న‌క‌రాజు (Korean Kanakaraju) అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వరుణ్‌ సరసన మిరాయ్ భామ‌ రితికా నాయక్‌ (Ritika Nayak) కథానాయికగా నటిస్తుంది.

Korean Kanakaraju

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. వరుణ్‌ తేజ్‌, ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘వరుణ్‌ కెరీర్‌లోనే ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతోంది. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్‌- తమన్‌ కాంబినేషన్‌లో మరోసారి అదరగొట్టే ఆల్బమ్‌ రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్డేట్స్‌ త్వరలో ఇవ్వబోతున్నాం’ అని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Oct 26 , 2025 | 07:56 AM