Mehreen Pirzada: మెహ్రీన్ సీక్రెట్ పెళ్లి.. ఆ నీచుడి పనే ఇది

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:16 PM

తాజాగా టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా (Mehreen Pirzada) తనపై వస్తున్న రూమర్స్ పై ఫైర్ అయ్యింది. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మెహ్రీన్.

Mehreen Pirzada

Mehreen Pirzada: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పూలు మాత్రమే కాదు కొన్నిసార్లు ముళ్లు కూడా దాటాల్సి ఉంటుంది. ఆ ముళ్లే రూమర్స్. ముఖ్యంగా హీరోయిన్ పై రూమర్స్ అనేవి ఇండస్ట్రీలో కామన్ అయ్యిపోయాయి. కొంతమంది హీరోయిన్స్ వాటిని లైట్ తీసుకుంటే.. ఇంకొంతమంది హీరోయిన్స్ సీరియస్ అవుతారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా (Mehreen Pirzada) తనపై వస్తున్న రూమర్స్ పై ఫైర్ అయ్యింది. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మెహ్రీన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో క్రష్ గా నిలిచిపోయింది.

ఇక మొదటి సినిమా తరువాత అమ్మడికి మంచి అవకాశాలు వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు. ఎఫ్ 2, ఎఫ్ 3 మినహా మెహ్రీన్ నటించిన ఏ సినిమా అంత ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ముద్దుగా బొద్దుగా ఉండే మెహ్రీన్.. బక్కచిక్కి సన్నజాజి తీగలా మారిన కూడా అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. ఈలోపు బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. త్వరలో పెళ్లి అనుకొనేలోపు నిశ్చితార్దాన్ని క్యాన్సిల్ చేసుకొని మరో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తున్న మెహ్రీన్ ఈ మధ్యనే సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది.

తాజాగా తాన్ సీక్రెట్ మ్యారేజ్ రూమర్స్ పై మెహ్రీన్ స్పందించింది. స్పందించింది అనడం కంటే నిప్పులు చెరిగింది అని చెప్పొచ్చు. తనకు పెళ్లి అయ్యింది అని రాసిన జర్నలిస్టుల పేర్లతో సహా చెప్పి వారిని కడిగిపారేసింది, ఇది జర్నలిజం కాదని, నా పెళ్లి గురించి మీకేమి తెలుసు అంటూ మండిపడింది. 'ఈ రోజుల్లో ఎలాంటి పర్యవసానాలు లేకుండా తప్పుడు సమాచారం ఎలా వ్యాపిస్తుందో చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇక డబ్బు తీసుకుని రాసే పనికిమాలిన కథనాల విషయానికి వస్తే, జర్నలిజం ఖచ్చితంగా దెబ్బతింది. నేను ఈ విషయంపై 2 సంవత్సరాలుగా మౌనంగా ఉన్నాను, కానీ నిరంతర వేధింపుల కారణంగా ఈ రోజు మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.

కొన్ని ఆంగ్ల వెబ్ సైట్స్ లో నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను అంటూ ఆర్టికల్స్ వచ్చాయి. అందులో నేను నాకు తెలియని, ఎప్పుడూ కలవని ఎవరో XYZ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని రాశారు. స్పష్టంగా, నా వికీపీడియాను హ్యాక్ చేసి, రెండు నిమిషాల పాపులారిటీ కోసం ప్రయత్నించిన ఒక నీచుడి పని ఇది. కాబట్టి, నేను ఇక్కడ అసలు నిజాన్ని స్పష్టం చేస్తున్నాను. నాకు ఎవరితోనూ పెళ్లి కాలేదు. నన్ను నమ్మండి.. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Dec 16 , 2025 | 05:16 PM