అచ్చమైన తెలుగు చిత్రం
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:21 AM
అగస్త్య, రబియా ఖతూన్ జంటగా దర్శకుడు విపిన్ తెరకెక్కించిన సినిమా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై ఉమాదేవి కోట నిర్మించారు. ఈ నెల 22న విడుదలవుతోంది.
అగస్త్య, రబియా ఖతూన్ జంటగా దర్శకుడు విపిన్ తెరకెక్కించిన సినిమా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై ఉమాదేవి కోట నిర్మించారు. ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఉమాదేవి, విపిన్ విలేకరులతో చిత్ర విశేషాలు వివరించారు. ‘సినిమా అంతా చక్కని తెలుగులో ఉంటుంది. మాటల ఉచ్చారణలో కూడా అచ్చమైన తెలుగుని వింటారు. ఒక మనిషి మరో మనిషిని చూసినప్పుడు ఎలా స్పందిస్తారు? ప్రేమ ఎలా పుడుతుందనేది ఈ కథలో మీరు చూస్తారు.
సినిమాలో రాధిక పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆవిడ మంచి గాయకురాలు. కొన్ని కారణాల వల్ల పాడటం మానేసి సాధారణ కుటుంబ జీవితం గడుపుతారు. ఈ పాత్రలో రాధిక స్ర్కీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ట్రావెన్‌కోర్ ప్రిన్స్ కూడా నటించారు. ఆయన శాస్త్రీయ సంగీతం కోసం చేసిన సేవ మనం ఊహించలేం. అలాంటి ఒక క్యారెక్టర్‌ని పరిచయం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. జస్టిన్ మంచి సంగీతాన్ని అందించారు. చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ వచ్చిందని ప్రేక్షకులు ఫీల్ అవుతారు’ అని వారు అన్నారు.