Megastar Chiranjeevi: శంక‌ర వ‌ర ప్ర‌సాద్.. పండ‌గ లుక్ అదిరింది

ABN , Publish Date - Aug 27 , 2025 | 01:19 PM

వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని స‌ర్‌ఫ్రైజ్ ఇస్తూ మూవీ నుంచి మెగాస్టార్ లుక్ రిలీజ్ చేశారు.

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), న‌య‌న‌తార (Nayanatara) జంట‌గా అనీల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు పండ‌క్కి వ‌స్తున్నారు (Mana Shankara Vara Prasad Garu). శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జ‌న‌వ‌రిలో సంక్రాంతికి థియేట‌ర్ల‌కు రానుంది. ఇటీవ‌లే చిరంజీవి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా సినిమా టైటిల్ రివీల్ చేసిన మేక‌ర్స్ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చిరు.

Chiranjeevi

అది ఇంకా మ‌రువ‌క ముందే.. తాజాగా ఈ రోజు (బుధ‌వారం) వినాయ‌క చ‌వితి (Vinayaka Chavithi) ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని స‌ర్‌ఫ్రైజ్ ఇస్తూ మేక‌ర్స్ మూవీ నుంచి మెగాస్టార్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ చూస్తే పండ‌క్కి మ‌రింత పండగ తీసుకు వ‌చ్చారంటూ చిరంజీవి అభిమానులు కొనియాడుతున్నారు. కేర‌ళ బ్యాక్ వాట‌ర్స్‌లో ప‌డ‌వ‌పై విహ‌రించే లుక్‌లో చిరంజీవి స్టైల్ అదిరింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Updated Date - Aug 27 , 2025 | 01:19 PM