Megastar Chiranjeevi: ‘కొదమసింహం’.. సినిమా పెడితే తప్ప చరణ్‌ భోజనం చేసేవాడు కాదు

ABN , Publish Date - Nov 20 , 2025 | 08:53 AM

‘కొదమసింహం’ చిత్రం నాకూ, రామ్‌చరణ్ కూ ఫేవరేట్‌ మూవీ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.

Megastar Chiranjeevi

‘కొదమసింహం’ (Kodama Simham) చిత్రం నాకూ, రామ్‌చరణ్ (Ram Charan) కూ ఫేవరేట్‌ మూవీ. చిన్నప్పుడు వాళ్లమ్మ ఈ సినిమా క్యాసెట్‌ పెడితే తప్ప చరణ్‌ భోజనం చేసేవాడు కాదు. రీ రిలీజ్‌తో ఈతరం ప్రేక్షకులు కూడా ‘కొదమసింహం’ చిత్రాన్ని ఆస్వాదిస్తారు’ అని చిరంజీవి (Megastar Chiranjeevi) అన్నారు. 1990లో విడుదలైన ఈ సినిమాను 4కే కన్వర్షన్‌, 5.1 డిజిటల్‌ సౌండింగ్‌తో సరికొత్తగా రమా ఫిలింస్‌ అధినేత కైకాల నాగేశ్వరరావు విడుదల చేస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి (Chiranjeevi) వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. ‘నాకు కౌబాయ్‌ చిత్రాలంటే ఇష్టం కావడంతో కథ వినగానే ‘కొదమసింహం’ చేసేందుకు అంగీకరించాను. ఈ తరం ప్రేక్షకులనూ అలరిస్తుంది. డాన్స్‌, ఫైట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’ అని చె ప్పారు.

నిర్మాత‌ కైకాల నాగేశ్వరరావు (Kaikala Nageswara Rao) మాట్లాడుతూ ‘మంచి క్వాలిటీతో ‘కొదమసింహం చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నాం. రాజ్‌కోటి సూపర్‌హిట్‌ సాంగ్స్‌తో పాటు నేపథ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. అప్పట్లో కొత్త తరహా పాత్రలో చిరంజీవి గారిని చూపించాలని ఈ సినిమా చేశాం’ అని అన్నారు. ఈ సినిమా అంత గొప్పగా రావడానికి చిరంజీవి గారి పట్టుదలే కారణం అని దర్శకుడు మురళీమోహన్‌రావు (K. Murali Mohana Rao) అన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 08:53 AM