Mana Shankara Varaprasad Garu: మెగా విక్టరీ రచ్చ.. ఆర్ యూ రెడీ
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:21 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu )'.
Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu )'. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటితో కలిసి సుస్మిత కొణిదెల నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన నయనతార (Nayanthara) నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, మీసాల పిల్ల, శశిరేఖ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా థర్డ్ సింగిల్ మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆర్ యూ రెడీ అంటూ సాగిన ఈ సాంగ్‌లో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా స్పెషల్ డాన్స్‌తో కనిపించాడు. ఎన్నోరోజులుగా అభిమానులు ఈ సాంగ్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోమోలో ఎనర్జీ లెవల్స్ అదిరిపోయాయి. మాస్ బీట్స్, స్టైలిష్ స్టెప్స్, పూర్తి రచ్చ రచ్చ వైబ్ ఉంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ట్రెండీగా ఉంది. న్యూ ఇయర్ పార్టీలకు పర్ఫెక్ట్ సెలబ్రేషన్ యాంథమ్ అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 30 న రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.