Nilakanta: హీరోగా మరో.. బాల నటుడు! ఆకట్టుకుంటున్న.. నీలకంఠ టీజర్
ABN , Publish Date - Dec 18 , 2025 | 09:54 PM
పెదరాయుడులో బాల నటుడిగా, ఆపై దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో కీ రోల్ చేసి పేరు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కిన తెలుగు చిత్రం నీలకంఠ.
మోహన్‌బాబు పెదరాయుడులో బాల నటుడిగా, ఆపై దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో కీ రోల్ చేసి పేరు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్ (Master Mahendran) హీరోగా తెరకెక్కిన తెలుగు చిత్రం నీలకంఠ. నేహా పఠాన్ (Neha Pathan), యశ్న ముత్తలూరి (Yashna Muthuluri) కథానాయికలుగా నటించగా స్నేహా ఉల్లాల్, రాంకీ, బబ్లూ ఫృథ్వీ, శుభలేక సుధాకర్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలు చేశారు. ఎడాదిన్నరగా చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి2న విడుదలకు ముస్తాబయింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమా అఫీసియల్ టీజర్ విడుదల చేయగా సినీ లవర్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. చూడడానికి కొత్త హీరోగా అనిపించినా, చిన్న మూవీగా కనిపించినా కంటెంట్ మాములుగా లేదు అని అనిపించేలా టీజర్ ఉంది. గ్రామీణ ప్రాంతంలో ప్రేమలు, అల్లర్లు, వివాదాల నేపథ్యంలో మంచి యాక్షన్ సన్నివేశాలతో సినిమాను అద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. మీరూ ఇప్పుడే టీజర్ చూసేయండి. ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసులు, వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించచగా రాకేశ్ మాదవన్ (Rakesh Madhavan)దర్శకత్వం వహించాడు.