Master Bharat: నటుడు భరత్ ఇంట్లో విషాదం

ABN, Publish Date - May 19 , 2025 | 12:16 PM

మాస్టర్‌ భరత్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతని మాతృమూర్తి కమలహాసిని ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చెన్నైలో గుండెపోటుతో మరణించారు.

మాస్టర్‌ భరత్‌ (Master Bharat) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతని మాతృమూర్తి కమలహాసిని (Kamala Haasini) ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆమెకు 53 సంవత్సరాలు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. భరత్‌ గురించి పరిచయం అక్కర్లేదు. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలుగులో 'అంజి' సినిమాతో కెరీర్‌ ప్రారంభించి ''రెడీ, ఢీ, దూకుడు, హ్యాపీ, దేనికైనా రెడీ'' ఇలా తెలుగు, తమిళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించాడు. ''రెడీ, బిందాస్‌'' చిత్రాలకు రెండు నంది అవార్డులను భరత్ అందుకున్నాడు. అతని తల్లి మరణవార్త తెలుసుకున్న బంధువులు, సన్నిహితులు, నటీనటులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆమెకు భరత్ ఒక్కడే సంతానం. (RIP Kamala Haasini)

Updated Date - May 19 , 2025 | 02:05 PM