Maruva Tarama: ఈ ట్రైలర్.. ఏంటి ఇంత సింపుల్‌గా బావుంది
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:44 AM
ప్రేమ అనేది చిన్న మాట.. కానీ దానిని పడడం మాత్రం చాలా కష్టం వంటి డైలాగులతో సింఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం మరువతరమా.
హరీష్ ధనుంజయ (Hariish Dhanunjaya), అతుల్య చంద్ర (Athulya Chandra), అవంతిక హరి నల్వా (Avantika Hari Nalwa) జంటగా చైతన్య వర్మ నడింపల్లి (Chaitanya Varma Nadimpalli) దర్శకత్వంలో రూపొందిన చిత్రం మరువతరమా (Maruva Tarama). రోహిణీ, ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ బ్యానర్ (Silver Screen Pictures)పై రమణ మూర్తి, రుద్రరాజు, విజయ కుమార్ రాజు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు మంచి స్పందనను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. నవంబర్ 28న విడుదలకు రెడీ అయింది.
ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఇది పక్కా మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్ అని స్పష్టమవుతోంది. ప్రేమలోని మధుర క్షణాలు, బాధలు, లోతైన ఎమోషన్లు ఇలా అన్ని రకాల బావాలను టచ్ చేసిన ఒక కవితాత్మక ప్రేమప్రయాణం లా కనిపిస్తోంది. ముఖ్యంగా బేబీ ఫేం విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్‌లో ఉంది. అలాగే విజువల్స్ సైతం అబ్బుర పరిచేలా ఉన్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమ కథ ఉంటుంది.. అది ఎప్పుడు మొదలవుతుందన్నది ఎవరికీ తెలియదు అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్‌లో ప్రేమపై పలికే సంభాషణలు ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉన్నాయి. “లవ్ అనేది చెప్పలేని ఓ మ్యాజిక్, ప్రేమ అనేది చిన్న మాట అయినా.. దానిని పడడం మాత్రం చాలా కష్టం వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇదిలాఉంటే.. తమిళ క్రియేటివ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి, లేటెస్ట్ సెన్షేషన్ ది గర్ల్‌ఫ్రెండ్ ఫేం రాహుల్ రవింద్రన్ వంటి దర్శకులు ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయడమే గాక అభినందనలు తెలియజేయడం ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా చేసింది.