Sant Tukaram: భక్తిప్రతిఘటనగా మారితే

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:57 AM

మరాఠీ నటుడు సుబోధ్‌ భావే టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘సంత్‌ తుకారామ్‌’. ఆదిత్య ఓం దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌...

మరాఠీ నటుడు సుబోధ్‌ భావే టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘సంత్‌ తుకారామ్‌’. ఆదిత్య ఓం దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని ఆవిష్కరించింది. తన భక్తిని ప్రతిఘటనగా మార్చిన 17వ శతాబ్దపు మరాఠీ సాధువు, కవి సంత్‌ తుకారామ్‌ జీవితం, వారసత్వం, సాహిత్య విప్లవం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శివ సూర్యవంశీ, షీనా చోహన్‌, సంజయ్‌ మిశ్రా, అరుణ్‌ గోవిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు ముకేశ్‌ ఖన్నా వాయిస్‌ ఓవర్‌ ఈ చిత్రానికి హైలెట్‌ కానుంది. నిఖిల్‌ కామత్‌, రవి త్రిపాఠి, వీరల్‌, లావన్‌ స్వరపరచిన పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Updated Date - Jul 17 , 2025 | 05:58 AM