Manushi Chhillar: ప్రేమతో.. మానుషీ
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:31 AM
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ విశ్వ సుందరి మానుషీ చిల్లర్. ఆమె...
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ విశ్వ సుందరి మానుషీ చిల్లర్. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావు కథానాయకుడిగా పులకిత్ తెరకెక్కిస్తున్న ‘మాలిక్’ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
రాజ్‌కుమార్ రావును ఆమె ప్రేమతో చూస్తున్న ఈ ఫొటో ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఆమె పోషిస్తున్న రోల్ మునుపటి చిత్రాల్లో కంటే భిన్నంగా ఉండనుందని మేకర్స్ తెలిపారు. జూలై 11న చిత్రం విడుదలవుతోంది. కాగా, జాన్ అబ్రహం నటిస్తున్న ‘తెహ్రాన్’ చిత్రంలోనూ మానుషీ చిల్లర్ నటిస్తున్నారు.