Manchu Brothers: కలిసిపోయిన మంచు బ్రదర్స్..
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:11 PM
మంచు బ్రదర్స్ కలిసిపోయారా.. అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. సినిమా వారిద్దరిని కలిపింది. అంటే వారిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అని కాదు.
Manchu Brothers: మంచు బ్రదర్స్ కలిసిపోయారా.. అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. సినిమా వారిద్దరిని కలిపింది. అంటే వారిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అని కాదు. ఒకరి సినిమాకు ఒకరు సపోర్ట్ గా నిలబడడం.. అన్నదమ్ముల మధ్య అను బంధాన్ని తెలియజేస్తుంది. మంచు మోహన్ బాబు వారసులు విష్ణు (Vishnu), మనోజ్ (Manoj).. గత కొన్ని నెలలుగా ఆస్తి తగాదాల్లో గొడవ పడుతున్న విషయం తెల్సిందే. విష్ణు, మోహన్ బాబు ఒక సైడ్ ఉండి.. మనోజ్ ను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. అంతేకాకుండా తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడంతో పాటు చెయ్యి కూడా చేసుకున్నారని ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.
ఇక విష్ణు తనను చంపాలని చూస్తున్నాడంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే కుటుంబం అన్నాకా ఇలాంటి గొడవలు సహజమే. అన్నదమ్ముల మధ్య గొడవలు లేని ఇల్లు ఉంటుందా.. వారే కలిసిపోతారు అని మోహన్ బాబు చెప్పినట్లుగానే.. మంచు బ్రదర్స్ కలిసిపోయారు. మొన్నటికి మొన్న మనోజ్.. కన్నప్ప సినిమా రిలీజ్ రోజున ఆ సినిమా బాగా విజయం సాధించాలని కోరుకుంటూ అల్ థ్ బెస్ట్ చెప్పుకొచ్చాడు. దానికి ముందు కన్నప్పగురించి నెగిటివ్ కామెంట్స్ చేసినా అవన్నీ సరదాగా చేసినవని చెప్పి.. తన అన్న సినిమా బాగా ఆడాలని కోరుకున్నాడు. అందరూ థియేటర్ కు వెళ్లి మరీ చూడమని తెలిపాడు.
ఇప్పుడు విష్ణు సైతం.. మనోజ్ సినిమాకు అల్ ది బెస్ట్ చెప్పుకొచ్చాడు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం మిరాయ్. ఈ సినిమాలో మనోజ్ విలన్ గా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ మిరాయ్ నేడు రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని విష్ణు ఎక్స్ వేదికగా మిరాయ్ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ' మిరాయ్ కి అల్ ది బెస్ట్. దేవుడు మంచి విజయం అందివ్వాలని కోరుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చాడు.
ఇక విష్ణు పోస్ట్ కు మనోజ్ రిప్లై ఇస్తూ.. ' థాంక్యూ సో మచ్ అన్నా ' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇలా మాట్లాడుకుంటుంటే బావుందని, సినిమాకు శుభాకాంక్షలు చెప్పడం నుంచి మొదలై ఇద్దరూ కలిసి మాట్లాడుకోనేవరకు రావాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు అన్నదమ్ములు నిజంగానే కలిసిపోయారా.. ? లేదా.. ? అనేది చూడాలి.