Kannappa: ‘కన్నప్ప’ కోసం అమెరికాకు విష్ణు మంచు! గ్లోబల్ ప్రమోషన్స్ షురూ

ABN , Publish Date - May 07 , 2025 | 05:19 PM

విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. జూన్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ను స్టడీ చేస్తూ గ్లోబల్‌గా ప్రమోట్ చేసేందుకు విష్ణు రెడీ అయ్యాడు.

vishnu

డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa). ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో సినిమా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌బోతున్నాడు. ఈక్ర‌మంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ను స్టడీ చేస్తూ గ్లోబల్‌గా ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇందుకోసం అమెరికాను ఎంచుకుని మే 8న న్యూజెర్సీ నుంచి ప్ర‌చారం ప్రారంభించ‌నున్నాడు. అక్కడ విష్ణు నార్త్ బ్రున్స్‌విక్‌లోని రీగల్ కామర్స్ సెంటర్‌లో అభిమానులతో ముచ్చటించనున్నారు.

Kannappa.jpg

ఆ త‌ర్వాత మే 9న డల్లాస్‌కు వెళ్లి సాయంత్రం 7 గంటలకు గెలాక్సీ థియేటర్స్ గ్రాండ్‌స్కేప్, ది కాలనీ, టెక్సాస్ లో ప్రేక్షకులతో సందడి చేయనున్నారు. చివ‌ర‌గా మే 10న శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఈ పర్యటన ముగియ‌నుంది.. అక్కడ ఆయన ఉదయం 10:30 గంటలకు సినీ లాంజ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్‌ను సందర్శిస్తారు. ఈ చిత్రం ఓవర్సీస్ విడుదలను వాసారా చూసుకుంటోంది. అనంతరం ఇండియాకు తిరిగి రానున్న విష్ణు.. దేశంలోని పలు నగరాల‌ను సైతం చుట్టి రానున్నారు.

Kannappa.jpg

ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి, అన్ని ప్రాంతాల మీడియాతో విష్ణు మంచు ఇంటరాక్ట్ కానున్నారు. ‘కన్నప్ప’ నుంచి వచ్చిన భక్తి గీతం "శివా శివా శంకరా" విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని లవ్ ట్రాక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి కన్పప్ప ట్రైలర్‌పై ఉందన్న సంగతి తెలిసిందే. ట్రైలర్ రిలీజ్‌తో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటుతాయి. జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా పలు భాషలలో ‘కన్నప్ప’ (Kannappa) చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

Updated Date - May 07 , 2025 | 05:27 PM