Kannappa Movie: కన్నప్పకు ఆర్జీవీ రివ్యూ.. ఏడ్చేసిన మంచు విష్ణు
ABN , Publish Date - Jun 28 , 2025 | 06:34 PM
ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం రిలీజైన కన్నప్ప (Kannappa)మంచి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది. చాలాకాలం తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu) ఈ రేంజ్ లో సక్సెస్ ను అందుకున్నాడు.
Kannappa Movie: ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం రిలీజైన కన్నప్ప (Kannappa)మంచి పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది. చాలాకాలం తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu) ఈ రేంజ్ లో సక్సెస్ ను అందుకున్నాడు. ముకేశ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రభాస్ (Prabhas)హైలైట్ గా నిలిచాడు. మొదటి రోజు దాదాపు రూ. 20 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఇక అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం కన్నప్పపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV).. కన్నప్ప సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
ఆర్జీవీ .. స్పెషల్ గా మంచు విష్ణుకు వాట్సాప్ ద్వారా ఒక నోట్ ను పంపించాడు. ఆ చాట్ స్క్రీన్ షాట్ ను విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో వర్మ.. మంచు విష్ణు నటనను ఆకాశానికి ఎత్తేశాడు. ' నేను దేవుడును, భక్తులను అస్సలు నమ్మను. అందుకే నేనెప్పుడూ కూడా భక్తి చిత్రాలను చూడను. కాలేజ్ చదువుతున్న సమయంలో ఒరిజినల్ కన్నప్ప నాలుగు స్టార్లు చూసాను. కానీ, అది కేవలం హీరో, హీరోయిన్, సాంగ్స్ కోసం మాత్రమే.
కానీ, తిన్నడుగా నీ నటన చూసాక నువ్వు కనిపించలేదు. ఎంతో భక్తి, విస్వసం మూర్తీభవించినా ఒక వ్యక్తి కనిపించావు. కొన్ని సీన్స్ లో అయితే నన్ను ఊపిరి తీసుకోనివ్వలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తిన్నడు.. శివలింగం మీద కాలు పెట్టి, రెండు కళ్లు సమర్పించే సీన్ చాలా అద్భుతంగా చేశావ్. దేవుడిని నమ్మని నేను కూడా ఎంతో ఇష్టంగా చూసేలా నటించావు. షియా భక్తుడిగా నువ్వు మారిన విధానం ఒక మాస్టర్ క్లాస్. నీ భావోద్వేగాలు, నీ హవాభావాలు చాలా అద్భుతం. అందరూ ప్రభాస్ కోసం సినిమాకు వెళ్తున్నాం అంటున్నారు. కానీ, నేను మాత్రం నిన్ను చూడడానికే మరోసారి టికెట్ తీసుకొని వెళ్తున్నా.. ' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక వర్మ మెసేజ్ కు విష్ణు స్పందిస్తూ ..'రాము గారూ! మీరు నన్ను ఏడిపించారు. నేను చాలా కాలంగా నా కన్నీళ్లను ఆపుకున్నాను. నేను ఈ కష్టాలను అధిగమించగలనని నమ్మాను కాబట్టి వాటిని బయటకు రానివ్వడం లేదు. ఇది నా జీవితంలో అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో ఒకటి. నేను ఎక్కడ తిరిగినా, ఎవరితో మాట్లాడినా అందరూ సందేహాన్నో.. ద్వేషంనో చూసాను ' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.