Kannappa: ఆ రెండు పాత్రలపై విష్ణు క్లారిటీ..

ABN , Publish Date - Jun 09 , 2025 | 09:23 PM

తమ సినిమా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినవని నటుడు, నిర్మాత మంచు విష్ణు (Manchu Vishnu) అన్నారు. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో అలాంటి వాటికి ఆస్కారం లేదని వివరించారు.


తమ సినిమా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినవని నటుడు, నిర్మాత మంచు విష్ణు (Manchu Vishnu) అన్నారు. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో అలాంటి వాటికి ఆస్కారం లేదని వివరించారు. ఆయన టైటిల్‌ పాత్రలో ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక, గిలక పేర్లు తమ మనోభావాలు దెబ్బతీశాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సినిమాలో ఆ పేర్లను తొలగించకపోతే, విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. గుంటూరులో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగానూ ఆందోళన చేపట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై మంచు విష్ణు స్పష్టత ఇచ్చారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాను తీర్చిదిద్దామని అన్నారు. దీని కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ుూహిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, ఆ పరమశివుడిని భక్తితో చూపించాం ప్రతి రోజూ  సన్నివేశాలను తెరకెక్కించే ముందు భక్తితో పూజించి, వేద పండితుల  ఆశీర్వచనం తీసుకునేవాళ్లం. స్ర్కిప్ట్‌ దశలోనే వేదాధ్యాయనం చేసిన వారితో పాటు, పలువురు ఆధ్యాత్మిక వేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాం. భక్తి ్తతత్వాన్ని వ్యాప్తి చేయడమే ‘కన్నప్ప’ తీయడం వెనుక అసలు ఉద్దేశం. అంతే కానీ, వివాదాలు కాదు. సినిమా విడుదలయ్యే వరకూ ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండండి. సినిమా ప్రేక్షకుల రాకముందే ఓ నిర్ణయానికి రాకండి’’ అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.


Updated Date - Jun 09 , 2025 | 09:28 PM