Manchu Manoj: మంచు మనోజ్ స్పీడ్ పెంచాడు..
ABN , Publish Date - May 08 , 2025 | 05:18 PM
మంచు మనోజ్‌ని (manchu manoj) తెరపై చూసి చాలాకాలమైంది. 2018 వచ్చిన ఆపరేషన్ 2019 చిత్రంతో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు చిత్రాలు ప్రకటించినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు.
మంచు మనోజ్‌ని (manchu manoj) తెరపై చూసి చాలాకాలమైంది. 2018 వచ్చిన ఆపరేషన్ 2019 చిత్రంతో అతిథి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు చిత్రాలు ప్రకటించినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తను నటించిన ‘భైౖరవం’ (Bhairavam) చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘మిరాయ్’లో విలన్‌గా కనిపించబోతున్నారు. ఇవి కాకుండా హీరోగా ఓ రెండు సినిమాలు ఉన్నాయి. అవి మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు మనోజ్. 90 ఎం.ఎల్ (90Ml) ఫేమ్ శేఖర్ రెడ్డి (Sekhar reddy) ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి ‘అత్తరు సాయిబు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది. టైటిల్ వినగానే ఇది ఏ తరహా సినిమానో అర్థం చేసుకోవొచ్చు. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ తో సాగే కథ ఇది. కొద్ది రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు ఓ దారికి వచ్చాయి. ఈ నెల 20న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో బయటకు వస్తాయి.
‘వాట్ ద ఫిష్’, ‘అహం బ్రహ్మస్మి’ సినిమాలు మంచు మనోజ్ ఇది వరకే మొదలెట్టాడు. అయితే ఇవి ఎంత వరకూ వచ్చాయో తెలియాలి. భైరవం’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. మినీ మల్టీస్టారర్ సినిమా ఇది. ‘కన్నప్ప’కు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది మనోజ్ ప్లాన్. ఇది వరకు ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే అదే రోజున భైరవం’ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘కన్నప్ప’ వాయిదా పడడంతో ‘భైరవం’ చిత్రాన్ని వాయిదా వేశారు.