Manchu Manoj: చిన్న, పెద్ద అని లేదు.. కథ బాగుంటేనే ఆదరిస్తున్నారు
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:12 AM
మంచు మనోజ్ విడుదల చేసిన ‘వానర’ టీజర్‌కి మంచి స్పందన. కథ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని మనోజ్ వ్యాఖ్యలు. అవినాశ్ నటించిన, దర్శకత్వం వహించిన చిత్రం.
‘ఈ రోజు చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు. కథాంశం బాగున్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి చిత్రాలు భాషలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఆడుతున్నాయి. ‘వానర’ టీజర్ బాగుంది. అవినాశ్ కష్టపడి తీస్తోన్న ఈ సినిమా విజయవంతం కావాలి’ అని ఆకాంక్షించారు హీరో మంచు మనోజ్ (Manchu Manoj).
అవినాశ్ తిరువీధుల (Avinash Thiruveedhula) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వానర’ (Vanara). సిమ్రాన్ చౌదరి హీరోయిన్ (Simran Choudhary). శంతను పత్తి సమర్పణలో అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి నిర్మిస్తున్నారు.
గురువారం నిర్వహించిన వేడుకలో టీజర్‌ను మంచు మనోజ్ విడుదల చేశారు. అవినాశ్ తిరువీధుల మాట్లాడుతూ.. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాను త్వరలో విడుదల చేస్తాం’ అని అన్నారు.