Manchu Laxmi: ఆమె అంటే నాకు, బన్నీకి చాలా భయం.. ఇలా తీసిపడేస్తుంది

ABN , Publish Date - Sep 20 , 2025 | 09:15 PM

మంచు లక్ష్మీ (Manchu Laxmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఆమె ఇండస్ట్రీలోనే పెరిగింది.

Manchu Laxmi

Manchu Laxmi: మంచు లక్ష్మీ (Manchu Laxmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఆమె ఇండస్ట్రీలోనే పెరిగింది. స్టార్ కుటుంబాలతో లక్ష్మీకి మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కుటుంబాలకు మంచు కుటుంబానికి మంచి స్నేహం ఉంది. ఆ ఇంటి వారసులు ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉన్నారు. ఇక మంచు లక్ష్మీ.. అల్లు అర్జున్ ఎంత మంచి స్నేహితులు అనేది అందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి చిన్నతనం నుంచి ఇప్పటివరకు చాలా అల్లరి పనులు చేశారు. అయితే వీరిద్దరికీ ఒకరంటే భయమట. ఆ విషయాన్ని లక్ష్మీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


మంచు లక్ష్మీ నటించిన దక్ష సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇక ఒక ఇంటర్వ్యూలో తనకు అల్లు అర్జున్ కూతురు అర్హ అంటే చాలా భయమని, తనకే కాదు అల్లు అర్జున్ కూడా చాలా భయమని చెప్పుకొచ్చింది.' నాకు, బన్నీకి అర్హ అంటే చాలా భయం. అందరినీ ఇట్టే తీసిపడేస్తుంది. ఒకసారి వాళ్ల నాన్న పియానో వాయిస్తుంటే.. మీ నాన్న చాలా బాగా పాడతాడు అంటే.. ఆ ఒక్క పాటే వచ్చులే అని తీసిపడేసింది. అసలు మీ నాన్న ఎంత కష్టపడతాడో తెలుసా అంటే నేర్చుకుంటే ఎవరైనా పాడతారు అని అంటుంది.


ఇక మొన్న నేను, అర్హ, బన్నీ వీడియో ను వారిద్దరే కావాలని తీశారు. అంతకుముందే నన్ను అర్హ ఆ ప్రశ్న అడిగింది. కానీ, మళ్లీ బన్నీ.. అర్హ నిన్ను ఒక ప్రశ్న అడుగుతుంది అంట.. సమాధానం చెప్పు నేను వీడియొ తీస్తాను అని.. నీకు తెలుగు వచ్చా.. నువ్వు మాట్లాడేది తెలుగేనా అని అడిగింది. నేను, బన్నీ చేసిన వీడియోలు చాలా ఉన్నా.. ఇదే బాగా వైరల్ అవుతుందని పోస్ట్ చేశాం. నిజంగా అర్హ ఒకహైడ్రోజన్ బాంబ్. ఎంత ముద్దుగా మాట్లాడుతుందో.. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎంతో ముద్దుగా మాట్లాడుతుంది' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం లక్ష్మీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Idly Kottu Trailer: ఇడ్లీ కొట్టు ట్రైలర్.. ధనుష్ కి మరో హిట్ గ్యారెంటీ

Geetha bhagat: ట్రెండింగ్‌లో ఆర్‌.పి.పట్నాయక్‌ ‘తను రాధా.. నేను మధు’..

Updated Date - Sep 20 , 2025 | 09:15 PM