Manchu Lakshmi: ఆ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు..

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:29 PM

లైంగిక వేధింపులు.. అమ్మాయిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఇలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా బస్సుల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

Manchu Lakshmi

Manchu Lakshmi: లైంగిక వేధింపులు.. అమ్మాయిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఇలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా బస్సుల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చేతులు వేయడం, కావాలని తాకడం.. కొందరు కామాంధులు ఇలాంటి పనులు చేయడానికే బస్సులు ఎక్కుతూ ఉంటారు. సామాన్య మహిళలకే కాదు.. సెలబ్రిటీల వారసులు కూడా ఇలాంటి లైంగిక వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు. తాజాగా మంచు వారసురాలు మంచు లక్ష్మీ (Manchu Lakshmi).. తన చిన్నతనంలో తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల ఘటనను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

' ఇది నేను 15 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు జరిగింది. ఆ చేదు ఘటనను ఇప్పటివరకు నేను మర్చిపోలేదు. ప్రతిరోజు నన్ను మా అమ్మే స్కూల్ కి తీసుకెళ్లేది. మా సొంత బండిలోనే వెళ్లడంతో.. బస్సు ప్రయాణం అంతగా తెలిసేది కాదు. మాతో పాటు బాడీ గార్డ్స్ కూడా ఉండేవారు. అయితే పరీక్షలకు హాల్ టికెట్స్ ఇవ్వడానికి మాత్రం స్కూల్ వాళ్లే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో తీసుకెళ్తారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ, ఆ ప్రయాణం భయంకరమైంది అని తరువాత తెల్సింది.

బస్సులో ఒక వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. వెంటనే నేను భయపడ్డాను. నాకేం చేయాలో అర్ధం కాక పక్కనే ఉన్న ఫ్రెండ్స్ కి చెప్పాను. సెలబ్రిటీ పిల్లలమైన మాకే ఇలా ఉంటే.. ఇక సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటి. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో వెళ్లే మహిళల పరిస్థితి ఏంటి. నిత్యం వాళ్లు ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ, బయటకు చెప్పుకోరు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Nov 16 , 2025 | 04:29 PM