Manchu Lakshmi: మంచు లక్ష్మి.. దక్ష టీజర్ వచ్చేసింది! ఆ సినిమా.. పేరు మార్చి వదిలారు
ABN , Publish Date - Aug 27 , 2025 | 10:22 AM
చాలాకాలం తర్వాత మంచు లక్ష్మి సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
చాలాకాలం తర్వాత మంచు లక్ష్మి (Manchu Lakshmi) సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తనే లీడ్ రోల్‌లో నటించిన యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రం దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) (Daksha - The Deadly Conspiracy) విడుదలకు ముస్తాబవుతుంది. తమ సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ (Sree Lakshmi Prasanna Pictures) బ్యానర్‌పై మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించగా వంశీకృష్ణ మల్ల (Vamsee Krishna Malla) దర్శకత్వం వహించాడు. సముద్రఖని (samuthirakani), విశ్వంత్ (Viswant Duddumpudi), మలయాళ నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల ప్రధాన పాత్రలో నటించగా మోహన్ బాబు (Manchu Mohan Babu) సైతం కీ రోల్ చేశారు.
అయితే మూడేండ్ల క్రితమే అగ్ని నక్షత్రం (Agni Nakshatram) పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ చిత్రం పోస్టర్లు, టీజర్ సైతం విడుదల చేయడం విశేషం. ఇప్పుడు ఇదే సినిమా పేరును దక్షగా మార్చి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 27 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. గత టీజర్‌లా కాకుండా థ్రిల్లింగ్ అంశాలతో సరి కొత్తగా టీజర్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ను చూస్తే.. సినిమాను ఫుల్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు అర్ధమవుతోంది. ఓ వైపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే మంచు లక్ష్మీ పవర్‌పుల్ పోలీసాఫీసర్‌గా యాక్షన్ సీన్లలో అదర గొట్టిందనే చెప్పాలి. టీజర్ చివరలో మోహన్‌బాబు ఎంట్రీ ఇచ్చి ట్విస్టు ఇచ్చారు. కాగా సినిమాను ఊహించని ట్విస్టులతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) (Daksha - The Deadly Conspiracy) సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.