Lechindhi Mahila Lokam: నోబడీ కెన్ నిలదీశ్‌పై మీ! లేచింది మహిళాలోకం.. అంటున్న మంచు లక్ష్మీ
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:27 AM
లక్ష్మీ ప్రసన్న, అనన్య నాగళ్ల వంటి స్టార్లు నటిస్తోన్న లేచింది మహిళాలోకం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన చిత్రం తెరపైకి వస్తోంది. మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రద్దా దాస్ (Shraddha das), సుప్రీతా నాయుడు (Bandaru Sheshayani Supritha), హరితేజ (Hari teja), హేమ వంటి తారలు ప్రధాన పాత్రల్లో ఓ మహిళా ప్రాధాన్య చిత్రం లేచింది మహిళా లోకం (Lechindhi Mahila Lokam) రూపొందింది. ఎప్పుడో 2022లోనే ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇన్నాళ్లకు ఈ చిత్రం నుంచి అప్డేట్ ఇచ్చారు.
లక్ష్మీ ప్రసన్న, అనన్య నాగళ్ల ఇద్దరు కలిసి ఓ ఫన్నీ వీడియో చేసి సినిమా బజ్ కోసం హీరోల దగ్గరకు వెళ్లడం ఎందుకు నా కన్నా ఎక్కువా అంటూ మగవాళ్లు మనోభావాలు, జేమ్స్ కెమరూన్, నిలదీశ్‌ఫై అంటూ ఫన్నీ ఫన్నీగా డైలాగులు వల్లిస్తూ బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉంటే కార్తీక్ అర్జున్ (Carthyk Arjun) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, హైమా రాజశేఖర్, శ్వేత మహి, నిరోషా నవీన్ నిర్మించారు. త్వరలో థియేటర్లకు రానుంది.